అన్వేషించండి

Ganesh Chaturthi 2023: వినాయకుడికి పత్రి పూజ - మరే దేవుడికీ లేదెందుకు!

వినాయకచవితి రోజు విగ్రహాన్ని తీసుకొచ్చి ఏక వింశతి పత్రి పూజ చేస్తారు. అంటే 21 రకాల ఆకులతో పూజ అన్నమాట. ఇంతకీ పత్రి పూజ ఎందుకు చేయాలి? దాని వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా!

Ganesh Chaturthi 2023: ఏ దేవుడికైనా పూలు, అక్షతలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి పూజ చేస్తారు. కానీ పార్వతీ తనయుడి పూజకు మాత్రం పత్రి తప్పనిసరి. పూలున్నా లేకపోయినా పత్రిని వినియోగిస్తారు. వినాయకునికి చేసే ఏకవింశతి పత్రి (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. అవేంటి? పత్రితో లంబోదరుడిని ఎందురు పూజించాలి? నిమజ్జనం రోజు వీటిని కూడా గంగలో ఎందుకు వేస్తారో తెలుసా?

Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!

పత్రి పూజ వెనుకన్న పరమార్థం

వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే  పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్య పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట. 

మాచీపత్రం
మంచి సువాసన ఉన్న ఆకు ఇది. ఈ ఆకు వాసన తగిలినా తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.

బృహతీపత్రం
దగ్గు, ఉబ్బసం, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను నివారించేందుకు బృహతీపత్రం ఉపయోగపడుతుంది

బిల్వపత్రం 
బిల్వపత్రం ఆకు పసరు చర్మ దోషాలను నివారిస్తుంది

దూర్వాపత్రి
రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.

దత్తూరపత్రం
ఆస్తమా,  దగ్గు, కీళ్లనొప్పులకు మంచి మందు దత్తూర పత్రం. ఈ ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులకు మందుగా పనిచేస్తుంది

బదరీ పత్రం
ఈ పత్రం అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది

అపామార్గ పత్రం 
గాయాలను తగ్గించడంతో పాటూ చర్మ సమస్యలన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది

చూతపత్రం ( మామిడి)
భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!

కరవీర పత్రం
కరవీరపత్రం తలలో చుండ్రు తగ్గిస్తుంది కానీ ఈ మొక్క విషతుల్యమైనది..అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి

విష్ణుక్రాంతపత్రం
దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది ఈ పత్రి

దాడిమీపత్రం
శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది దాడిమీపత్రం

దేవదారుపత్రం
దేవదారుపత్రం నుంచి తీసిన తైలం... చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ప్రేరణకు ఉపయోగపుడుతంది దేవదారు పత్రం

మరువకపత్రం
నరాల బలహీనత తగ్గించేందుకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది

సింధువారపత్రం
వాతం, తనొప్పులను తగ్గిస్తుంది.  పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది

జాజిపత్రి
ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి మంచి శక్తిని కల్పిస్తాయి. వాపులును తగ్గిస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

గండకీపత్రం
కడుపులో నులిపురుగులను హరించివేసేందుకు ఉపయోగపడుతుంది గండకీ పత్రం

శమీపత్రం
ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టుగాలి స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 

అశ్వత్థపత్రం
శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు అశ్వత్థపత్రాన్ని వినియోగిస్తారు

అర్జునపత్రం
అర్జునపత్రం బెరడుతో తయారయ్యే కషాయం గుండెను ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది

అర్కపత్రం
తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి

తులసీదళం
దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది. అయితే తులసితో వినాయకుడికి పూజ చేయరు..కానీ వినాయకచవితి ఒక్కరోజు పూజిస్తారు

ఈ పత్రాలన్నింటితో పూజించి చివరిగా ‘ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి’ అంటూ పూజను ముగించాలి.

Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!

ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికీ, ఆడంబరానికీ పెద్ద పీట వేస్తున్నాయి. అందుకే మట్టి గణేషుడినే పూజించి నిమజ్జనం చేయాలి. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.  మిగిలిన పండుగలు, దేవుళ్లకు నిమజ్జనం హడావుడి ఉండదు..పైగా వానాకంల మొదలైన వెంటనే చవితి పండుగ వస్తుంది కాబట్టి...కొత్తగా వచ్చే నీటిని శుద్ధి చేస్తాయి ఈ పత్రిలన్నీ...అందుకే ఏకవింశతి పత్రి పూజ చేయాలని చెబుతారు. 

Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget