అన్వేషించండి

Horoscope 12th March 2024: ఉల్లాసమైన స్వభావం ఈ రాశివారికి పెద్ద ఆస్తి, మార్చి 12 రాశిఫలాలు

Horoscope Tomorrow's Prediction 12 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Tomorrow: 12 March 2024  Prediction

మేష రాశి

ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు గౌరవం దక్కుతుంది. తక్షణ ప్రయోజనాలు ఉండవు కానీ మంచి ఫలితం పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధి మీ పనికి అడ్డంకిగా మారొచ్చు. ఆర్థిక విధానంలో మార్పు వస్తుంది. సామాజిక సేవ చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. 

వృషభ రాశి

ఈ రోజు కుటుంబ సభ్యులతో వివాదం జరిగే అవకాశం ఉంది..మాట తూలొద్దు.  విద్యార్థులు తమ పనిని రేపటికి వాయిదా వేసుకోవడం మానుకోవాలి. వైవాహిక జీవితంలో గౌరవం, సంరక్షణ ముఖ్యమని మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు తెలుసుకుంటారు.  మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. 

Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మిథున రాశి

ఉల్లాసమైన  స్వభావం మీకు అతిపెద్ద ఆస్తి. దీర్ఘకాల అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ  రోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి నుంచి గుడ్ న్యూస్ వింటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వాహనాలు, యంత్రాలు, అగ్నిప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా గృహిణులు అజాగ్రత్తగా ఉండకూడదు.  అనుకోని ఖర్చులు చేయాల్సి  వస్తుంది. ఏ వ్యక్తి మాటలకు ప్రభావితం కావద్దు.  

కర్కాటక రాశి

ఆలోచనాత్మకంగా మాట్లాడండి..శత్రువులు తగ్గుతాయి. ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. ఆస్తిపై పెట్టుబడులు కలిసొస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  మీరు మీ కోసం కొంత సమయాన్ని వెచ్చించేలా ప్లాన్ చేసుకోండి. 

సింహ రాశి

పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. మీకు నచ్చిన ఉపాధి లభిస్తుంది. ఆర్థిక ప్రగతికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. సకాలంలో రుణం చెల్లించగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది. 

 ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!

కన్యా రాశి

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైన వంటకాలు ఆస్వాదిస్తారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక కార్యాలు విజయవంతమవుతాయి. మీరు తెలివైన వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. ఇతరులతో వివాదాలకు దిగకండి. లావాదేవీల సమయంలో జాగ్రత్త . ఈ రోజంతా బిజీగా ఉంటారు. 

తులా రాశి

ఆదాయంలో నిశ్చయత ఉంటుంది.  వ్యాపారంలో లాభం ఉంటుంది. ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి రావొచ్చు. అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతిట్టుంది. తొందరగా అలసిపోతారు. ప్రత్యర్థుల మాటల ప్రభావానికి లోనుకావొద్దు. ఇంట్లో పండుగ వాతావరణం మీ ఒత్తిడి తగ్గిస్తుంది. స్నేహితుడితో డబ్బుకి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకునేందగుకు చొరవ తీసుకోవాలి.
 
వృశ్చిక రాశి

అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోతే నిరాశ చెందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. పని చేయాలని అనిపించదు. మీరు పెట్టుబడి కోసం ప్రతిపాదనను పొందవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్రేకానికి గురికాకుండా ఉండండి. ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవు.  ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ ప్రియమైన వారి అవసరాల పట్ల సున్నితంగా ఉండండి.  ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం గురించి అస్సలు ఆలోచించకండి.

Also Read: ఇవాల్టి ( మార్చి 11) నుంచి ఫాల్గుణ మాసం - విశిష్టత, ఈ నెలలో పండుగలివే!

ధనుస్సు రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఏ చిన్న తప్పు చేసినా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.  మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకునే ధైర్యం చేస్తారు. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. చాలా కాలం తర్వాత బంధువులు, స్నేహితులు కలుస్తారు.  విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దు. ఎలాంటి సంకోచం లేకుండా మీ ప్రేమను చూపించండి.  శుభవార్త అందుకుంటారు. సంతోషంగా ఉంటారు.    

మకర రాశి 

ప్రయాణం లాభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది.  ఇంట్లో , బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం  కలిసొస్తుంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు అనారోగ్య కారణాల వల్ల పని దెబ్బతింటుంది. వ్యాయామంతో రోజు ప్రారంభించండి. చేపట్టిన పనులు పూర్తిచేయడంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. 

కుంభ రాశి

ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయాలి. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మరింత బాధ్యతలు పెరుగుతాయి. తొందరగా అలసిపోతారు. సహోద్యోగుల నుంచి సహకారం లభించదు. పిల్లల విషయంలో కొనసాగుతున్న ఆందోళనలు తీరిపోతాయి.  చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఎదురైనా జీవితం సాఫీగా సాగుతుంది.  

మీన రాశి

పాత మిత్రులను కలుస్తారు.  నిలిచిపోయిన డబ్బు అందుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి.  వ్యాపారంలో లాభం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే మంచి సమయం. ఆదాయం పెంచుకునేందుకు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Hyderabad MLC Elections:.హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యింది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Hyderabad MLC Elections:.హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
Test Movie Review - టెస్ట్ రివ్యూ: క్రికెట్ కాదు... అంతకు మించి - Netflixలో నయన్, మాధవన్, సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే?
టెస్ట్ రివ్యూ: క్రికెట్ కాదు... అంతకు మించి - Netflixలో నయన్, మాధవన్, సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే?
YS Sharmila: తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేశారా? డెడ్‌లైన్ దగ్గరపడుతోంది!
రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేశారా? డెడ్‌లైన్ దగ్గరపడుతోంది!
Hyderabad Mumbai High Speed Rail Corridor : హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
Embed widget