News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూలై 12 రాశిఫలాలు ,ఈ రాశివారు అహంకారం ప్రదర్శించి మంచి పేరు చెడగొట్టుకుంటారు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 12 బుధవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Horoscope Today July 12, 2023

మేష రాశి
ఈ రోజు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి.  మీ స్నేహితుల మద్దతు పొందుతారు.  కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదానికి దిగుతారు. తొందరపాటుతో వ్యవహరిస్తే  మీకు సమస్యలు తప్పవు. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

వృషభ రాశి 
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో ఓపికగా ఉండాల్సిన రోజు.  ఆగిపోయిన పని పూర్తైనప్పుడు సంతోషంగా ఉంటారు. ఆర్థిక మూలాలు పెరుగుతాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కల ఈరోజు నెరవేరుతుంది. అప్పిచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు. మీరు తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

మిథున రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అయినప్పటికీ ఆనందంలో అనవసర వాగ్ధానాలు చేయొద్దు. భావోద్వేగ నిర్ణయాలకు చాలా మంచి సమయం కాదు. మీ సామర్థ్యంతో ఏపనినైనా ముందుగానే పూర్తిచేస్తారు. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు శుభవార్త వింటారు. మీకు తెలిసిన ముఖ్యమైన సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. 

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. తెలివితేటలతో చేసిన పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు.  మీరు పెద్ద లక్ష్యాన్ని వేగంగా సాధిస్తారు. ప్రతి కష్టం నుంచి సులభంగా బయటపడతారు.  మీ ప్రత్యర్థుల్లో కొందరు మీ పురోగతిని వ్యతిరేకించవచ్చు. ఈ రోజు స్నేహితులను కలుస్తారు.

సింహ రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలకు సంబంధించి ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి. మీరు కార్యాలయంలో మీ ప్రణాళికలలో కొన్నింటిలో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది . కుటుంబంలో ఎవరికైనా వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే మీరు సాల్వ్ చేసేందుకు మొదలెడతారు. మీపనిపై  పూర్తి దృష్టిని కొనసాగించండి.  ఈరోజు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. 

కన్యా రాశి
కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాపార వర్గాలు వారి ప్రణాళికలపై పూర్తి దృష్టిని కొనసాగించాలి.  ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకుంటే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మిత్రులతో సాన్నిహిత్యం ఉంటుంది. మీరు ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చాలి. కొన్ని శుభవార్తలను వినవచ్చు. సోదరుడు లేదా సోదరి కారణంగా డబ్బు ఖర్చు చేయవచ్చు. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. 

Also Read: కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారికి ఆదాయం, పదోన్నతి!

తులా రాశి 
ఈ రోజు మీకు కొన్ని చిక్కులు తెచ్చి పెడుతుంది. తొందరపడి మాట తూలకండి.  ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి  .  పనిలో చురుకుదనం ఉంటుంది . ఏదైనా ముఖ్యమైన పనిలో మీరు ఓపికగా ఉండాలి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. 

వృశ్చిక రాశి 
ఈ రాశివారు చదువు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.  కార్యాలయంలో మీ సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. మీరు పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టాలి. పరస్పర సహకార స్ఫూర్తి మీలో ఉంటుంది. కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కనబరుస్తారు. పెద్దల మాటలు వినండి వారిని గౌరవించండి. మీ చుట్టూ తిరుగుతూ  ముఖ్యమైన సమాచారాన్ని సేకరించేవారున్నారు జాగ్రత్త.

ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు ఆనందంంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలలో కొత్త శక్తి ఉంటుంది.  ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం మంచిది. మీరు మీ శక్తిని సరైన పనిలో పెట్టాలి, అప్పుడే మీరు దానిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అహంకారంతో మాట్లాడకండి మీకున్న మంచి పేరు నశిస్తుంది . విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చేరడం ద్వారా పేరు సంపాదించుకుంటారు. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు.  కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో మీ నమ్మకం అలాగే ఉంటుంది. మీరు కొంతమంది కొత్త వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ ధైర్యసాహసాలు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తిచేయండి.

Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!

కుంభ రాశి

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనిలో వేగం చూపించవలసి ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని విలువైన వస్తువులను కూడా సేకరించవచ్చు. సంప్రదాయ పనుల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు.

మీన రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. సృజనాత్మక పనిపై పూర్తి ఆసక్తిని చూపుతారు. ముఖ్యమైన విషయాల్లో ఏదైనా గొప్ప అవగాహనను ప్రదర్శించాలి. మీ  మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ మాటల్లో సౌమ్యత మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ ప్రియమైన వారినుంచి సహకారం అందుతుంది. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది.

Published at : 12 Jul 2023 05:06 AM (IST) Tags: daily horoscope Horoscope Today Today Horoscope Astrological prediction for 2023 July July 12th horoscope

ఇవి కూడా చూడండి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన