Horoscope Today 7th February 2025: ఈ రాశులవారికి అవసరానికి డబ్బు చేతికందుతుంది..కెరీర్ గురించి పక్కా ప్రణాళికలు వేసుకుంటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 7 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఉన్నత చదువులకోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. హోటల్ వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ప్రియమైన వారికి సమయం కేటాయిస్తారు. భవిష్యత్ కార్యాచరణలో బిజీగా ఉంటారు.
వృషభ రాశి
ఈ రోజు మీరు స్కిన్ సంబంధిత సమస్యలతో బాధపడతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. మీ ప్రతిభను మీరు నమ్ముకోండి. రిటైల్ వ్యాపారవేత్తలకు రోజు శుభప్రదమైనది.
మిథున రాశి
ఈ రోజు స్నేహితులతో వ్యక్తిగత సమస్యలు పంచుకుంటారు. పిల్లల తప్పుడు అలవాట్లు కొంత బాధను కలిగిస్తాయి. పూర్వీకుల వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మధ్యాహ్నం తరువాత రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది.
Also Read: భీష్మ ఏకాదశి ఎప్పుడు..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!
కర్కాటక రాశి
ఈ రోజు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ శ్రేయోభిలాషులతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పురోగతితో మీరు సంతృప్తి చెందరు. కొత్తగా ప్రారంభించే పనిలో అడ్డంకులు ఉండొచ్చు. ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు.
సింహ రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. ప్రమోషన్ కోసం ప్రయత్నించే ఉద్యోగులకు ఇది కలిసొచ్చే సమయం. పర్యాటర రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. మానసికంగా బలంగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోతారు. చేయని తప్పు విషయంలో అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇంటికోసం ఖర్చులు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకుని అడుగు వేయండి వృద్ధి ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీరు విలువైన బహుమతులు పొందుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు సాధారణ ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు అనుకోని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపం నియంత్రణలో ఉంచండి. అత్సుత్సాహం ప్రభావంతో మీరు చేపట్టే పని పాడవుతుంది. భగవంతుడిపై దృష్టి సారించడం ద్వారా ప్రశాంతత పొందుతారు.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
ధనుస్సు రాశి
కుటుంబ సభ్యులు మీ ధైర్యాన్ని పెంచుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇతరులు మీ సలహాతో గొప్ప ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి.
మకర రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
కుంభ రాశి
కుటుంబంలో ఉండే చిన్న చిన్న తగాదాలు పరిష్కరిస్తారు. బంధాల మధ్య అహానికి అవకాశం ఇవ్వొద్దు. కొత్త సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారు. సమయానికి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రియమైనవారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు.
మీన రాశి
మీ పనుల గురించి ఇతరులపై ఆధారపడకూడదు. సహోద్యోగులకు మీపై వ్యతిరేకత పెరుగుతుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తీవ్రత పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు కలసిరావు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















