అన్వేషించండి

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. డిసెంబరు 02 , 2023 ఈ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today  December 2nd 2023  (డిసెంబరు 2 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఒక స్నేహితుడు మీకు శుభవార్త అందిస్తాడు. సాయంత్రం ఎవరినైనా ప్రత్యేకంగా కలుస్తారు. విద్యార్థులు చదువు విషయంలో ఒత్తిడికి లోనవుతారు. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రోజు మీరు ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి రావొచ్చు. మీ ప్రవర్తన తీరు అందరకీ నచ్చుతుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందే అవకాశం ఉంది. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రోజు మీకు కొంత గందరగోళంగా అనిపిస్తుంది. టెన్షన్ పడతారు. కుటుంబ సభ్యుల గురించి ఆందోళన ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు తమ బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

Also Read: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశివారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. రోజంతా ఉరకలు పరుగులుగా అనిపిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బావుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీనుంచి స్ఫూర్తి పొందేలా మీ ప్రవర్తన ఉంటుంది. చేపట్టిన పనిలో సక్సెస్ అవుతారు. 

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

మీరు రిస్క్ కు దూరంగా ఉండడం మంచిది.ఈ రోజు మీరు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ఫలితం పొందలేరు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉండదు. ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహికం జీవితం సాధారణంగా ఉంటుంది. 

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారు ఈ రోజు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించి మంచి డీల్ జరిగే అవకాశం ఉంది. గత తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పనిలో నాణ్యత పెరుగుతుంది.  అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. 

Also Read: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారి వ్యాపారంలో కొత్త సహచరులు ఏర్పడవచ్చు. మీ పనులపై కన్నా ఇతరుల పనులపై మీకు ఆసక్తి ఎక్కువ.  ఆస్తి కొనుగోలు , అమ్మకం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. స్నేహితులను కలిసే అవకాశాలు లభిస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు మీ ప్రయాణంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవ్వర్నీ విమర్శించవద్దు. ఈ రోజు దూరపు బంధువులను కలుస్తారు. మీ మనస్సు కొంత అసంతృప్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు.

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారి వైవాహికం జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని చెడ్డ వార్తలు వినాల్సి రావొచ్చు. ఉద్యోగంలో కొంత అసంతృప్తి ఉంటుంది.  అసంపూర్తిగా ఉన్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మీరు కొత్త పనిని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. వ్యాపార సంబంధిత ప్రయాణాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. సౌకర్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వైవాహిక సంబంధాలతో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి..ఆరంభంలోనే పరిష్కరించుకోవడం మంచిది. ఇంట్లో వేడుక నిర్వహణపై  శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

Also Read: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ రాశివారు సహోద్యోగుల ద్వారా ఉద్యోగంలో లాభాలను పొందుతారు. కుటుంబంలో వినోద వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎక్కువ టైమ్ గడుపుతారు. ఆలోచనలను ప్రతికూలంగా మారనివ్వవద్దు. భాగస్వామ్యం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో అవసరం అయిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఉన్నత చదువులకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు.

Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
యూజ్డ్‌ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
సెకండ్‌ హ్యాండ్‌ Hyundai Venue కొనే ముందే కారులో ఇవి చూడండి, లేదంటే బోల్తా పడతారు!
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Human Immortality: మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
Embed widget