అన్వేషించండి

Horoscope Today December 1st, 2023: డిసెంబరు మొదటి రోజు రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. నవంబరు 29, 2023 బుధవారం మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today  December 1st 2023  (డిసెంబరు 1 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజు మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు ఆత్మ సంతృప్తిని పొందుతారు. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు. విద్యార్థులు తమ కెరీర్‌పై అజాగ్రత్తగా ఉండకూడదు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మధురంగా ​​ఉంచుకోండి. బంధువుల వల్ల ఒత్తిడులు ఉండవచ్చు. 

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రోజు మీరు శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భౌతిక సుఖాలను అనుభవిస్తారు. మొక్కుబడిగా ఏ పనీ చేయవద్దు. సోమరితనం వల్ల మీకే హాని కలుగుతుంది. కార్యాలయంలో మీ సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. గృహంలో సంతోష వాతావరణం ఉంటుంది.

Also Read: ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

కొత్త సంబంధాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆహారంలో స్వచ్ఛత అవసరం. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవనశైలి అస్తవ్యస్తంగా మారవచ్చు. మీ బాధ్యతలను మర్చిపోవద్దు.  కార్యాలయంలో ప్రత్యర్థులు చురుగ్గా మారవచ్చు...పనిలో జాగ్రత్త. 

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

నూతన వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు. ప్రేమ సంబంధాలకు వివాహ రూపం ఇచ్చేందుకు మంచి రోజు. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు కలిసొస్తాయి. భార్యాభర్తల మధ్య పరస్పర సఖ్యత పెరుగుతుంది.

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

తప్పుడు పనులపై ఆసక్తి చూపించకండి...మళ్లీ మళ్లీ అదే తప్పు చేయాల్సి రావొచ్చు. ముఖ్యమైన పనులను ఒకట్రెండు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.  స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. 

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఆర్థిక విషయాలకు ఈ రోజు చాలా మంచిది. వివాదాలలో మీ మాటే నెగ్గుతుంది. మీరు బీమా పాలసీలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా కాన్షియస్ గా ఉంటారు. సరైన పని లేకపోవడం వల్ల కొంత పరధ్యానంలో ఉంటారు. 

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

మీరు సుదీర్ఘ ప్రయాణం చేయవలసి రావచ్చు. సహోద్యోగుల మాటలు మీకు చెడుగా అనిపించవచ్చు. ఆసక్తి ఉన్న పని చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మీ పని నిదానంగా పూర్తయినట్లు కనిపిస్తుంది. అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకండి. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులను కలుస్తారు.

Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనవసరమైన ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇతర పనుల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఒకరిపై కోపం రావచ్చు. ఉద్రిక్తత పరిస్థితి ఉంటుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారు ఎవరికీ సలహా ఇవ్వకండి. మళ్లీ వివాదాలు తలెత్తవచ్చు. పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి నుంచి ఆర్థిక గ్యారెంటీ తీసుకోవద్దు లేదంటే నష్టపోతారు. భోజనాన్ని తగ్గించండి.  యోగా పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు చాలా మధురంగా ​​ఉంటాయి. సామాజిక పరిచయాలు ఏర్పడతాయి.  నిపుణుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. చాలా పనులు సమయానికి ముందే పూర్తవుతాయి.  విభేదాలు పరిష్కారమవుతాయి.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు..మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనేక పనులు ఏకకాలంలో నిర్వహించవలసి ఉంటుంది. ప్రతికూల భావాలను మీ మనస్సులోకి రానివ్వకండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో తొందరపడకండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏవిషయంలోనూ ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకండి. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంపై శ్రద్ధ వహించండి. మీ మనసైన వారితో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఉద్యోగులు పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget