ఈ రాశివారికి డిసెంబరులో అనుకోని సవాళ్లు తప్పవు! 2023 సంవత్సరంలో ఆఖరి నెలలో మిథున రాశి ఫలితం డిసెంబరు నెలలో మిథున రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. అనుకోని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కుటుంబంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించడం మీకు కష్టమవుతుంది. విభేదాలు పెరిగేకొద్దీ పరిస్థితి విషమిస్తుంది..ముందే జాగ్రత్తపడడం మంచిది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్య బాగానే ఉంటుంది. చీటికి మాటికి కోప్పడతారు. విరోధాలు, మాటపట్టింపులు ఉంటాయి. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 7 , కలిసొచ్చే రంగు స్కై బ్లూ . Images Credit: Pixabay