ఆగష్టు 18 రాశిఫలాలు, ఈ రాశులవారు అనవసర ఖర్చులు నియంత్రించాలి!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 18th
మేషరాశి
ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇతరులతో ఏర్పడిన విభేదాలు తొలగి విజయం సాధిస్తారు. వ్యాపారంలో వచ్చిన ఇబ్బందులను తెలివిగా, దైర్యంగా ఎదుర్కొని ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యకి అనుకూలమైన సమయం. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.
వృషభరాశి
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.రుణాలు ఇవ్వటం,తీసుకోవటం రెండు మంచివి కావు కనుక వీటికి దూరంగా ఉండండి. మీ కోరికలు ఏమున్నా ఈ రోజు దాదాపుగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల అవసరాలను గమనించి మసలుకోండి. కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశముంది, నివారించటానికి ప్రయత్నించండి.
మిధున రాశి
ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి మంచిదే. వ్యాపారస్తులకు ముందు వేసుకున్న ప్రణాళికలు కలిసివస్తాయి. విజయం సాధిస్తారు. కొత్త ప్రణాళికలు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.
Also Read: ఏడు చేపల కథ - పిల్లలకు మొదటగా ఆ కథే ఎందుకు చెబుతారో తెలుసా!
కర్కాటక రాశి
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు కొత్త వ్యక్తులను కలిసే అవకాశముంది. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.విబేధాలు తెలెత్తే అవకాశం ఉంది. సంయమనంతో మెలగండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వ్యాపారస్తులకు సమయం ఆశించినంత అనుకూలంగా లేదు. ధైర్యం కోల్పోకుండా కష్టపడి పని చేయండి. చుట్టు పక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీ పనులన్నీ విజయవంతమవుతాయి. జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బహుమతులు,సన్మానాలు పొందే అవకాశముంది. ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. మీరు ఈ రోజు షాపింగ్ చేయాలనుకుంటే అనుకూలమైన రోజు .స్నేహితులు , బంధువులు రాకతో మీరు చాలా సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. చేసిన తప్పులు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి. మీ కోపం వలన మీరే నష్ట పోతారు. కుటుంబ బంధాలు, సన్నిహిత సంబంధాలలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వివాదాలు తలెత్తుతాయి. మీ జీవిత భాగస్వామి మాటలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రోజు మీరు ప్రయాణం చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమే మంచిది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు శుభకార్యక్రమంలో పాల్గొనే అవకాశముంది. ఈ రోజు మీరు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చుల్ని నియంత్రించండి. ఆర్థిక విషయాలు కలిసివస్తాయి. ప్రేమ వ్యవహారాలు విజయం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత విద్యకి అనుకూలమైన సమయం. అద్భుత ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు దాచిన సొమ్ముతో పాలసీలలో పెట్టుబడి పెట్టొచ్చు, ఆర్థిక ప్రణాళికలు కలిసి వస్తాయి. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు అందుతాయి. మీ మనసులో ఉన్న సందేహాలకి స్వస్తి చెప్పండి.
Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి విదేశాలలో వ్యాపారం చేసే అవకాశాలు లభిస్తాయి. అతి పెద్ద వ్యాపార ఒప్పందాలు మీ ముందుకు వస్తాయి. వాటిని చేజిక్కించుకోండి. ఏదైనా సమస్యలుంటే కుటుంబ పెద్దలతో, కానీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులకు అంత అనుకూలంగా లేనందున, మీరు వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. తప్పుడు వ్యక్తుల సలహాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావచ్చు. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పాత తప్పులను అంగీకరించి, వాటిని సరిదిద్దటానికి ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో జాగ్రత్తగా , మంచిగా మసలుకోండి. మనసులో ఉన్న చెడుని అంతం చేయండి. మీ ప్రణాళికలను, రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు కెరీర్‌కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించడానికి అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగాన్ని కూడా ఈ రోజు ప్రారంభించవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి చర్చలు సఫలమవుతాయి. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి టూర్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తే కలిసివస్తుంది. మీ పిల్లల పురోభివృద్ధి కారణంగా మీరు ఉత్సాహంగా ఉంటారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ వ్యక్తులతో అనవసర విషయాల్లో విభేదాలు తలెత్తే అవకాశముంది. మీది కానీ విషయాల్లో తల దూర్చకండి. ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు ఆ వ్యాధులనుంచి విముక్తులవుతారు.ఉద్యోగులు పనివిషయంలో అశ్రద్ధ చూపవద్దు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడమే మంచిది.