అన్వేషించండి

Sravana Mangalvaram: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!

ప్రస్తుతం అధిక శ్రావణమాసం నడుస్తోంది. నిజ శ్రావణమాసం ఆగష్టు 17 గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఏటా శ్రావణంలో ఆచరించే నోములు,పూజలు అప్పుడే మొదలవుతాయి. ఈ ఏడాది శ్రావణ మంగళవారాలు ఎన్నొచ్చాయో తెలుసా!

Sravana Mangalvaram: సౌభాగ్యం, సత్సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం ఏటా శ్రావణమాసంలో వివాహితలు ఆచరిస్తారు మంగళ గౌరీ వ్రతం. ఈ సారి అధికశ్రావణం మాసం రావడంతో మొదటి నెల రోజుల్లో ఏ నోమూ నోచరు. మరి నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలైంది. ఈ ఏడాది ఎన్ని మంగళవారాలు వచ్చాయో చూస్తే...ఆగష్టు 17 గురువారం నుంచి నిజ శ్రావణమాసం మొదలై  సెప్టెంబరు 15 వరకు ఉంటుంది. అంటే ఈ ఏడాది నాలుగు శ్రావణ మంగళవారాలుంటాయి

  • ఆగష్టు  22 -మొదటి శ్రావణ మంగళవారం
  • ఆగష్టు  29 -శ్రావణ మంగళవారం రెండోది
  • సెప్టెంబరు 5 - మూడో శ్రావణ మంగళవారం
  • సెప్టెంబరు 12 - ఆఖరి శ్రావణ మంగళవారం

శ్రావణంలోని ప్రతి మంగళవారం స్త్రీలు మాంగల్యానికి అధిదేవత  అయిన ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తమ మాంగల్యాన్ని పదికాలాల పాటు  కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు తల్లి దగ్గరుండి చేయించాలి. అలాగే మొదటి వాయనం తల్లికి ఇవ్వడమే శ్రేష్ఠం అంటారు పండితులు. అత్తవారింట్లోనూ, ఇతర ముత్తైదువుల సమక్షంలోనూ నోము ప్రారంభించవచ్చు

Also Read: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!

వ్రతాన్ని ఆచరించే వారు పాటించాల్సిన నియమాలు

  • మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారు ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి
  • వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనం అందించాలి)
  • శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లపాటూ నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి ఐదుగురు ముత్తైదువులు చొప్పున మొదటి ఏడాది 5, రెండో ఏడాది 10, మూడో ఏడాది 15 ఇలా  ఆఖరి ఏడాది 25 మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏడాదికి ఐదుగురు ముత్తైదువులకు మాత్రమే ఇస్తారు.
  • ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించేవారు కొందరైతే... ఏ వారం ఎక్కడున్నా అక్కడ పసుపుతో అమ్మవారిని ఏర్పాటుచేసుకుని పూజ పూర్తిచేసేవారు ఇంకొందరు. ఇది పూర్తిగా మీ ప్రాంతంలో పాటించే నియమాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది.

Also Read: స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!

పూజా ఇలా చేసుకోవాలి
ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దానిపై గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ముందుగా  వినాయకపూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశపూజ, షోడశ ఉపచారాలతో అమ్మవారిని ఆరాధించి మంగళ గౌరి అష్టోత్తరం చదువుకోవాలి. తోరాలు తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచి, పిండి దీపారాధనలు తయారు చేసుకుని (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి ఓ తోరం అమ్మవారికి కట్టి, మరొకటి పూజ చేసుకునేవారు కట్టుకుని మిగిలినవి ముత్తైదువులకు కట్టాలి ( మీరు ఎంతమంది ముత్తైదువులను పిలుస్తారో అన్ని ఉండాలి). ముత్తైదువుకి పసుపు రాసి, బొట్టు పెట్టి , తోరం కట్టి తాంబూలంతో ఇచ్చి ఆమెను గౌరీ స్వరూపంగా భావించి కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget