చాణక్య నీతి: వీళ్లపై నోరు పారేసుకోవడం మహాపాపం



జీవితంలో మ‌నం ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకునే వాళ్లు త‌ల్లిదండ్రులే. వారు ఎలాంటి స్వార్థం లేకుండా మ‌న బాగు కోసం నిరంత‌రం ప‌రిత‌పిస్తుంటారు.



తల్లిదండ్రుల‌తో, స‌న్నిహితుల‌తో మనం ఎప్పుడూ గొడవ పడకూడదని, కోపం తెచ్చుకోకూడదని స్ప‌ష్టంచేశాడు చాణక్యుడు



ప‌రుష‌మైన మాట‌లు మన జీవితాలతో పాటు సంబంధాలను కూడా నాశనం చేస్తాయి. మన తల్లిదండ్రులతో మాట్లాడేట‌ప్పుడు ఎప్పుడూ దూషించే పదాలు ఉపయోగించకూడదని చాణక్యుడు చెప్పాడు.



కష్టపడి పెంచి, మంచి నడవడిక నేర్పి, మన భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన‌ తల్లిదండ్రుల గురించి దూషించే మాటలు మాట్లాడకూడదు.



మన జీవిత పురోగతిలో తల్లిదండ్రుల స్థానం చాలా ఎక్కువ, తల్లిదండ్రులతో ఏదైనా మాట్లాడే ముందు మన మాటలను అదుపులో ఉంచుకోవాలి.



కోపంగా ఉన్న వ్యక్తి తన ఆవేశాన్ని, కోపాన్ని తల్లిదండ్రులపై చూపిస్తాడు. కానీ, కోపంలో నిర్ణ‌యాలు తీసుకుంటూ, తన ఉన్న‌తికి కారణమైన వారిపై తన శక్తిని ప్రదర్శిస్తున్నాన‌న్న విష‌యాన్ని మరచిపోతాడు.



తల్లిదండ్రులు తమ జీవితమంతా మన కోసం, మన సంతోషం కోసం అంకితం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను ప‌ణంగా పెట్టి పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు



కోపంతో మనం అనే ఒక మాట వారి హృదయాలను గాయ‌ప‌రుస్తుంది. మన పరుషమైన మాటలు వారి కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి.



తల్లిదండ్రులతో మాట్లాడే ముందు దూషించే పదాలను ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఆలోచించి, మన నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడండి.



Images Credit: Pinterest