News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spirituality: స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!

వేద మంత్రాల సాక్షిగా వేసే మూడు ముడులు అత్యంత ప్రవిత్రమైనవి. సౌభాగ్యవతిగా వర్థిల్లాలని దేవతలు, పెద్దలు దీవించే సమయం. కానీ మంగళసూత్రం విషయంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు..అవేంటంటే..

FOLLOW US: 
Share:

Spirituality: మంగళం అంటే శుభప్రదం-శోభాయమానం.. సూత్రం అంటే తాడు- ఆధారమని అని అర్థం..పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. 

“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”

మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. అయితే చాలామంది మంగళసూత్రం వేసుకోవడం మానేశారు..వారి సంగతి పక్కనపెట్టేస్తే హిందూ సంప్రదాయాలపై విశ్వాసంతో మంగళసూత్రం వేసుకునే మహిళలు కూడా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు.  ఇంతకీ మంగళసూత్రం ఎలా ఉండాలి...  

  • మంగళసూత్రం హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి
  • సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు కుంకుమలను నిత్యం సూత్రాలకు పెట్టుకోవాలి
  • చాలామంది మంగళసూత్రాల్లో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టించుకుంటారు. ఇవి అందంగా ఉంటాయి కానీ సూత్రాలకు ఉండకూడదని చెబుతారు పండితులు
  • సూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి

Also Read: ఆగష్టు 10 రాశిఫలాలు, ఈ రాశులవారు కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి!

పిన్నీసులు వద్దు
మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడుతుంటారు. కనీ అసలు సూత్రాలకు ఇనుము వస్తువు తగలకూడదు. ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దలు చెబుతారు

Also Read: రోడ్డుపై వీటిని తొక్కేస్తున్నారా - ఏం జరుగుతుందో తెలుసా!

ముత్యం-పగడం మంచిదే
మంగళ సూత్రాలకు ముత్యం,పగడం యాడ్ చేయడం మంచిదే. కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహదోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విశ్వసిస్తారు. సాధారణంగా స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, రుతుదోషాలు ఏర్పడతాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ఇంట్లో అయినా స్త్రీ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.

"మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!" 

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట,పార్వతీ దేవి మెడలో ఉన్న ఆ మంగళ సూత్ర మహిమే అని పురాణాల్లో ఉంది. ఇంతత ప్రాముఖ్యత ఉన్న మంగళసూత్రాన్ని ఆధునికత పేరుతో పక్కనపెట్టేస్తున్నారు.

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు. వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Published at : 10 Aug 2023 12:50 PM (IST) Tags: Spirituality Impotrance of mangal sutra Effects if put pins in Mangal sutra Hindu Marraiage

ఇవి కూడా చూడండి

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips In Telugu: చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Vastu Tips In Telugu:  చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Horoscope Today 30 September 2023: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Horoscope Today 30 September 2023:   ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ