News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూన్ 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు!

Rasi Phalalu Today June 11th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Horoscope Today 11th June 2023: జూన్ 11 మీ రాశిఫలితాలు

మేష రాశి

మీరు ఈరోజు స్నేహితులతో ఆనందంగా  గడుపుతారు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. వృధాగా ధనవ్యయం. పెద్దల వలన ప్రయోజనం ఉంటుంది. వారి మద్దతు లభిస్తుంది.  ఆకస్మిక  ధనలాభంతో సంతోషంగా ఉంటారు.  పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. రిస్క్ తీసుకోవద్దు.

వృషభ రాశి

ఉద్యోగస్తులకు  ప్రమోషన్ గురించి వార్తలు వస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చి మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు, గౌరవం పొందుతారు. వ్యాపారులకు బాకీలు రికవరీ కావడానికి ఇది మంచి రోజు.

మిథున రాశి

ఈరోజు ఎవరో ఒకరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏదైనా పని చేయాలనే ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ,అధికారుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండదు. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. సన్నిహితుల వల్ల సమస్యలు వస్తాయి. విభేదాలు ఉంటాయి. దంపతులు ఒత్తిడికి లోనవుతారు. 

కర్కాటక రాశి

ప్రతికూలత ఆధిపత్యం చెలాయిస్తుంది. కోపం, అసహనం ఎక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధ వ్యాధులు తో ఇబ్బంది పడతారు. తప్పుడు ఆలోచనలు రాకుండా సంయమనం పాటించండి లేకుంటే నష్టాలు సంభవించవచ్చు. మాటల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కలహాలు, వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం ఉంటుంది. దైవారాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Also Read: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

సింహరాశి 

ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు . ప్రయాణాలు , షాపింగ్‌లలో సమయం గడుపుతారు. సన్నిహితుల ప్రవర్తన మీ పట్ల ఉదాసీనంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అధికారులతో సంభాషణ మీకు మేలుచేస్తుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో సహనంతో మెలగాలి. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. 

కన్యా రాశి

కుటుంబంలో ఆనందం ,ఉత్సాహం ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ధనలాభం వల్ల ఉపశమనం కలుగుతుంది. మీరు పనిలో విజయం, కీర్తిని పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. వ్యాపారంలో ప్రత్యర్థుల చేతిలో నష్టపోయే అవకాశం ఉంది. ఈ రోజు స్త్రీలకు సంతోషకరమైన రోజు . సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

తులా రాశి

ఈరోజు మీరు ఆశలను, కోరికలనునెరవేర్చుకుంటారు. మీరు రాజకీయ చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ప్రియమైన వ్యక్తితో సమావేశం ఆనందంగా ఉంటుంది. సన్నిహితుల విమర్శల వల్ల మనసు చెదిరిపోతుంది. శారీరక ,మానసిక ప్రశాంత ఉంటుంది. 

వృశ్చిక రాశి
ఈరోజు ఓపికతో పని చేయాలి. మీ శారీరక ఆరోగ్యం , మానసిక ఆరోగ్యం కూడా క్షిణిస్తుంది. తల్లికి అనారోగ్య సూచన. స్థిర, చర ఆస్తుల  విషయంలో జాగ్రత్త  అవసరం. నీటి ప్రదేశాలకువెళ్తే అప్రమత్తం గా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.

ధనుస్సు రాశి

ఈ రోజు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ అంశం గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. సన్నిహితులు ఎవరైనా కొత్త పనులు చేయడానికి మీనుంచి  ప్రేరణ పొందుతారు.  ఈరోజు ఆరోగ్యంనిలకడ గానే ఉంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది. మిత్రులు, బంధువులతో కలిసి ఆహ్లాదంగా  గడుపుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

మకర రాశి

ఈరోజు  మీ మాటలపై సంయమనం పాటిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు. ప్రతికూలతను నియంత్రించండి. ఆరోగ్యంగా ఉంటుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.  .

కుంభ రాశి

ఈ రోజు మీకు అత్యంత శుభకరం. కుటుంబంతో కలిసి విందులో పాల్గొంటారు, స్నేహితులతో విహారయాత్రలు చేస్తారు.  మీ ఆలోచనా శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడా బలంగా ఉంటుంది. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. చాలా కాలం తర్వాత ఈరోజు ప్రాణ స్నేహితుడిని కలుస్తారు.

మీన రాశి

అత్యాశ వల్ల నష్టం పోతారు. ఈరోజు పనిపట్ల మీ ఏకాగ్రత తగ్గుతుంది. శారీరక ఆరోగ్యం లోపిస్తుంది. పిల్లల సమస్య మిమ్మల్ని కలవరపెడుతుంది. వేరే ఊరికి వెళ్ళవచ్చు. ఆధ్యాత్మిక   పనులకు ఖర్చు చేస్తారు . న్యాయస్థానం-కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీలకు సమయం సరిపోదు.

Published at : 11 Jun 2023 05:26 AM (IST) Tags: daily horoscope Horoscope Today Aaj Ka Rashifal Check Astrological prediction Today Horoscope Astrological prediction for 2023 June 10

ఇవి కూడా చూడండి

Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!

Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!

Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!

Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి  - ఏ పురాణంలో ఏముంది!

Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు

Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు

Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి పై కన్ఫ్యూజన్ వద్దు - ఏ రోజంటే!

Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి పై కన్ఫ్యూజన్ వద్దు - ఏ రోజంటే!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి