News
News
X

Daily Horoscope Today 4 November: దీపావళి రోజు ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

మేషం
రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయవద్దు.  మీ సామర్థ్యానికి మించి పని చేయకండి. వ్యాపారంలో లాభాలుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి పండుగను ఆనందిస్తారు. చాలా రోజులుగా నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది.  బంధువులతో విభేదాలు పరిష్కార మవుతాయి. ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది.
వృషభం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల వైపు నుంచి విజయం సాధిస్తారు. మీ ప్రవర్తనతో ప్రశంసలు అందుకుంటారు. పనిపై పూర్తిగా దృష్టి పెడతారు. గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. 
మిథునం
ఇతరుల నుంచి ఏమీ ఆశించవద్దు.  వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రేమ విషయంలో యువత ఒత్తిడికి లోనవుతారు. మీ మనస్సును నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఖర్చు చేయవద్దు. వ్యాపారంలో పెద్ద భాగస్వామ్యాలను నివారించాలి. ప్రణాళికలను రహస్యంగా ఉంచండి.
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
కర్కాటకం
ఈరోజు ప్రోత్సాహకరమైన రోజు అవుతుంది. కెరీర్  సంబంధిత సమాచారం పొందుతారు.  కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బంధువులను కలుస్తారు.  నిలిచిపోయిన పనుల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 
సింహం
ఈ రోజు  అద్భుతంగా ఉంటుంది. మహిళలకు కలిసొచ్చే అవకాశం. డబ్బు విషయాల్లో న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పై అధికారుల సహాయంతో పనులు పూర్తవుతాయి. సోషల్ మీడియా ద్వారా ఏదైనా సామాజిక ప్రచారంలో చేరవచ్చు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. 
కన్య
మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి ప్రణాళికలు వేసుకోవచ్చు.  గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఎవరినీ నమ్మవద్దు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అతిగా ఖర్చు చేసే మీ ధోరణిని నియంత్రించుకోండి.
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
తులారాశి
మీరు సామాజిక రంగంలో చాలా ప్రాముఖ్యత పొందుతారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వ్యాపారంలో చాలా బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం
ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. కొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో గొడవలు రావచ్చు. కార్యాలయంలో శుభవార్తలు వింటారు. బంధువులను కలుస్తారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. 
ధనుస్సు
పాత మిత్రులను కలుస్తారు. విహారయాత్రకు వెళ్లవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. దినచర్య ప్రభావితం అవుతుంది. కుటుంబ సమేతంగా పండుగను ఆనందించండి. దంపతులు సంతోషంగా ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. వివాదంలో తలదూర్చవద్దు. బాధల నుంచి ఉపశమనం పొందుతారు. 
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
మకరం
ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బిజీ బిజీగా ఉంటారు.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. మీ పిల్లల పురోగతిని చూసి మీరు గర్వపడతారు.  అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. ఖర్చులు నియంత్రించండి. 
కుంభం
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. దేవుడి పూజలపై ఆసక్తి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండండి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందడం ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. సానుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి. టెన్షన్ పోతుంది. కుటుంబంతో గడుపుతారు.
మీనం
దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసి రావొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఉత్తమ సమయాన్ని ఆనందిస్తారు. టెన్షన్ తగ్గుతుంది. బంధువులతో చర్చిస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read:కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 06:23 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Daily Horoscope Today 4 November 2021

సంబంధిత కథనాలు

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today 6th October 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th  October 2022:  ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?