News
News
X

Horoscope Today: ఈ రోజు ఈ రాశులు వారు విజయం సాధిస్తారు, వారు అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు..ఏ రాశివారికి ఎలా ఉందంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

2021 అక్టోబరు 4 సోమవారం రాశిఫలాలు
మేషం
మేష రాశివారికి కలిసొచ్చే రోజిది. వ్యాపారస్తులకు లాభాలొస్తాయి. నిరుద్యోగులు  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  అనవసర ఖర్చులు ఉండొచ్చు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు.  స్నేహితుల నుంచి సహాయం అందుకుంటారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రయాణంలో ఇబ్బందులు ఉండవచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి. అనవసర రిస్క్ తీసుకోవద్దు.
వృషభం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.  ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు.  క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చు చేసేముందు ఆలోచించండి. రిస్క్ తీసుకోవద్దు.  కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త వింటారు. 
మిథునం
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మీ మాటపై సంయమనం పాటించండి. ప్రయాణాలు చేయాలనే ఆలోచన విరమించుకోండి. కెరీర్ సంబంధిత సమాచారం అందుతుంది. ఈరోజు బంధువులను కలుస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవితంలో కొత్త అనుభూతిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  ఉద్యోగంలో మార్పులుండొచ్చు.  విద్యార్థులు విజయం సాధిస్తారు. 
కర్కాటకం
చేపట్టిన పనులు పూర్తవుతాయి. స్నేహితుడి సహాయంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో బాధ్యత పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.  వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార పర్యటనకు వెళ్లొచ్చు.  ఓర్పుగా ఉండండి. రోజంతా హడావిడిగా ఉంటారు.  కెరీర్ సంబంధిత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కార్యాలయంలో నిరాశ పరిచే ఫలితాలు ఉండొచ్చు.  జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. అనారోగ్య సూచనలున్నాయి. 
సింహం
సింహ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తప్పవు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.  వృద్ధుల ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ప్రమాదకర పనులు చేసేటప్పుడు జాగ్రత్త.  కోపాన్ని తగ్గించుకోండి. వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. అన్నింటా జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.  విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి.  వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. 
కన్య
ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. అప్పిచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తగా ఉండండి. ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్నేహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం. ఏ పనిలోనూ తొందరపడకండి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో ప్రశంసలు అందుతాయి. పని  ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. సోమరితనం వద్దు. 
తుల
బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. సహోద్యోగుల మద్దతు ఉంటుంది. అనవసర ప్రసంగాలు తగ్గించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారస్తులకు శుభసమయం.  చట్టపరమైన విషయాలకు సంబంధించి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులుంటాయి. పెద్ద సమస్యకు పరిష్కారం సులభంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు తొందరపడకండి. మాటల్ని అదుపులో ఉంచుకోండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. ఖర్చులు  ఎక్కువై ఆందోళన పెరుగుతుంది.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. స్నేహితులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాల కోసం అవకాశాలు ఉంటాయి.   రిస్క్ తీసుకోకండి. పెట్టుబడికి సంబంధించి కొత్త ప్రణాళిక రూపొందిస్తారు.  ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 
ధనుస్సు
ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.  విద్యార్థులు కొత్త సమాచారాన్ని పొందుతారు. వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు.  ఉద్యోగస్తులు ప్రమోషన్ సమాచారాన్ని పొందుతారు. కుటుంబ  సభ్యులతో వివాద సూచనలున్నాయి. కొత్త  పెట్టుబడులు పెట్టొద్దు. విలువైన వస్తువులను రక్షించండి. బంధువులను కలుస్తారు.
మకరం
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  వ్యాపారం బాగానే ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు.   ప్రేమికులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. విద్యార్థులు కష్టపడి చదవాలి. మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు.
కుంభం
తెలియని అడ్డంకి వల్ల పని ప్రభావితం అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.  ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉంటాయి.  ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.  పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు.  కుటుంబంలో కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనం
ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.  ఆర్థికంగా కలిసొచ్చే రోజు.  చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.  వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులు నిరాశచెందుతారు. బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వృద్ధులకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు.  మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాల్లో తలదూర్చవద్దు.

Also Read: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు

Also Read: లోకల్, నాన్ లోకల్ కామెంట్స్ పై సీనియర్ హీరో రియాక్షన్..

Also Read: బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 06:52 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 4 October 2021

సంబంధిత కథనాలు

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

Suryanar Kovil Ratha Saptami 2023 Special: కుజ దోషం, శని దోషం నుంచి బయటపడేసే సూర్యభగవానుడి ఆలయం

Suryanar Kovil Ratha Saptami 2023 Special: కుజ దోషం, శని దోషం నుంచి బయటపడేసే సూర్యభగవానుడి ఆలయం

Mercury Transit in Capricorn 2023 : ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

Mercury Transit in Capricorn 2023 : ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ  బావుంది

Ratha Saptami Pooja Vidhanam In Telugu : రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం

Ratha Saptami Pooja Vidhanam In Telugu :  రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం

Horoscope Today 27th January 2023: ఈ రాశివారు మంచి మార్గంలో జీవిస్తారు, జనవరి 27 రాశిఫలాలు

Horoscope Today 27th January 2023: ఈ రాశివారు మంచి మార్గంలో జీవిస్తారు, జనవరి 27 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?