Horoscope Today: అక్టోబరులో మొదటి రోజు ఈ రాశుల వారు శత్రువులపై గెలుపు సాధిస్తారు, వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 అక్టోబరు 1 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు ప్రోత్సాహకరమైన సమాచారాన్ని పొందుతారు. మీ విలువ పెరుగుతుంది. తొందరగా అలసిపోతారు. రిస్క్ తీసుకుంటేనే కొన్నింట్లో విజయం వరిస్తుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో విభేదాలు పెరగొచ్చు. ఇతరుల భావాలను గౌరవించండి. మీ మాటపై సంయమనం పాటించండి. అసభ్య పదాలు ఉపయోగించవద్దు. అంచనాలు ఆలస్యం అవుతాయి. టెన్షన్ పెరుగుతుంది.
వృషభం
మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. బిజీగా ఉంటారు ఇతరులతో గొడవలు పడకండి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బాధ్యతలు సులభంగా నెరవేరుస్తారు. ఆనందంగా ఉంటారు. వివాదాలు ప్రోత్సహించవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వేరొకరిపై ఆధారపడి పనిని ప్రారంభించవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
మిథునం
ఈ రోజు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభిస్తారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పనిభారం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. తొందరగా అలసిపోతారు. బిజీ కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుంది.
కార్కాటకం
ఆర్థిక వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సమాచారం పొందే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. ఇతరుల పనికి మీరు బాధ్యత వహించవద్దు. అదృష్టం కలిసొస్తుంది. స్నేహితులు, బంధువులతో సయోధ్య ఉంటుంది. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. సీనియర్లు సహకరిస్తారు. అన్ని వైపుల నుంచి సంతోషం, సహకారం ఉంటుంది.
సింహం
యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. అనవసర మాటలు తగ్గించండి. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. పాత వ్యాధి తిరగబెట్టొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.
కన్య
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో మార్పు తక్షణ ప్రయోజనాలను ఇవ్వదు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. రిస్క్ తీసుకోకండి. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీకు గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనిభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
తుల
భయం, వ్యాధి, ఆందోళన, ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల కారణంగా అధిక వ్యయం చేస్తారు. ఇతరులతో గొడవలు పడకండి. అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. ప్రత్యర్థులతో జాగ్రత్త. పెద్దల ఆశీస్సులు మీకుంటాయి.
వృశ్చికం
లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఊహించని లాభాలు ఉండొచ్చు. ప్రయాణం విజయవంతమవుతుంది. మీరు కొత్త ఉద్యోగాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. ఆఫీసులో అడ్డంకులు ఉండొచ్చు. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. అతిథులు ఇంటికి వస్తారు. శుభవార్త వింటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వివాదాల్లో తలదూర్చవద్దు.
ధనుస్సు
ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటా విజయం సాధిస్తారు. చేసిన పనిలో ప్రశంసలు అందుకుంటారు. మానసిక అశాంతి ఉంటుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. అనుకున్న సమయానికి పని పూర్తవుతుంది. ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో సాధారణ వాతావరణం ఉంటుంది. పాత వ్యాధి తిరిగి రావచ్చు. కుటుంబం పట్ల ఆందోళన ఉంటుంది. దుర్వార్తలు వినే అవకాశం ఉంది.
మకరం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కలిసొచ్చే రోజు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఇంటా- బయటా ఆనందం ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇతరులతో గొడవలు పడకండి. ఒత్తిడి తగ్గుతుంది.
కుంభం
అనవసర ప్రసంగాలు ఇవ్వొద్దు. ఈ రోజంతా గందరగోళంగా ఉంటారు. భాగస్వాములతో విభేదాలు పెరగొచ్చు. అనుకున్న పనుల్లో అనవసర జాప్యం జరుగుతుంది. పరిస్థితులు చూసి ఆందోళన చెందవద్దు. శత్రువు భయం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయాల్సిరావొచ్చ. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మీనం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా కలిసొస్తుంది. ఆనందంగా ఉంటారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపరంలో లాభాలు పెరుగుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
Also Read: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..
Also Read: కన్నడ నటి సౌజన్య ఆత్మహత్య.. గుండె బరువెక్కిస్తున్న సూసైడ్ నోట్
Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి