అన్వేషించండి

Kannada Actress Suicide: కన్నడ నటి సౌజన్య ఆత్మహత్య.. గుండె బరువెక్కిస్తున్న సూసైడ్‌ నోట్‌

కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోక ముందే మరో నటి బలవన్మరణానికి పాల్పడటంతో కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

యువ నటి సౌజన్య ఆత్మహత్య కన్నడ చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. బెంగళూరులోని కుంబల్‌గోడులోని తన అపార్ట్‌మెంటులో ఆమె శవమై కనిపించింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమెకు సీని, టీవీ రంగాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. కొడగు జిల్లాలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్లకుండా బెంగళూరులో ఒంటరిగా గడుపుతోంది. గత కొద్ది రోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిసింది. గురువారం ఆమె నివసిస్తున్న అపార్టుమెంటుకు వెళ్లి చూస్తే.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించిందని కుటుంబికులు తెలిపారు. 

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సౌజన్య రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె గత మూడు రోజులుగా ఆ లేఖను రాస్తున్నట్లు తెలిసింది. అందులో ఆమె పదే పదే తన తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేసింది. ‘‘ఈ ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే. రోజు రోజుకు నాలో నేను కుమిలిపోతున్నాను. నా మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. దానికి తోడు అనారోగ్యం లోపల నుంచి చంపేస్తోంది. నన్ను నేను కోల్పోయినట్లు అనిపిస్తోంది. నన్ను నేను ఎప్పుడూ ఇలా చూసుకోలేదు. నేను ఇంటికి వస్తానని చెప్పాను. కానీ, ఇలా వస్తానని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించు అమ్మా. పపా (నాన్న) మీరంటే నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తున్నందుకు.. నన్ను క్షమించండి’’ అని ఆ లేఖలో రాసింది. దీన్ని ఆమె ఈ నెల 27న రాసింది. సౌజన్య కన్నడలో పలు సీరియళ్లు, రెండు సినిమాల్లో కూడా నటించింది. అయితే, లాక్‌డౌన్ తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనారోగ్య కారణాల వల్లా? అనేది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’.. మోస్ట్ రొమాంటిక్ ట్రైలర్ వచ్చేసింది!

ఈ ఏడాది జనవరిలో కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె గతేడాది జులైలోనే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది. ఆమె కుదుటపడుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. ఆత్మహత్య చేసుకుని సినీ పరిశ్రమను విషాదంలో నింపింది. ఆ ఘటన మరిచిపోక ముందే మరో నటి ఆత్మహత్య చేసుకోవడంతో మరింత ఆందోళన నెలకొంది. 

Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి ప్రియమణిి క్రైమ్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఫ్రీగా చూసెయ్యండి
డైరెక్ట్‌గా ఓటీటీలోకి ప్రియమణిి క్రైమ్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఫ్రీగా చూసెయ్యండి
Jagadhatri Serial Today Nov4:మూడు ముక్కలైన వజ్రపాటి కుటుంబం. ఒకే ఇంట్లో మూడు కుంపట్లు.
జగద్ధాత్రి సీరియల్:మూడు ముక్కలైన వజ్రపాటి కుటుంబం. ఒకే ఇంట్లో మూడు కుంపట్లు..
Bigg Boss Season 10 Today November 4th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
Ramayana Twitter Review - 'రామాయణ' ట్విట్టర్ రివ్యూ: పొగుడుతున్నంత లేదా? ప్రీమియర్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
'రామాయణ' ట్విట్టర్ రివ్యూ: పొగుడుతున్నంత లేదా? ప్రీమియర్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget