News
News
X

Horoscope Today : ఈ రాశుల ఉద్యోగస్తులకు ఈ రోజంతా శుభసమయమే, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబరు 21 మంగళవారం రాశిఫలాలు 

మేషం

మేషరాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. చెడుమార్గాల్లో ఉన్న మీ ప్రవర్తనని సరిచేసుకోవాల్సిన సమయం ఇది.  కార్యాలయంలో కానీ స్నేహితుడికి కానీ ఎదురయ్యే పెద్ద సమస్యకు మీరు పరిష్కారం సూచిస్తారు.ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించే సామర్థ్యం మీసొంతం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

వృషభం

మీరు పనిచేసే రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. తల్లికి సేవ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల షెడ్యూల్ ప్రకారం మీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా అపార్థాలు తొలగిపోతాయి.

మిథునం

మతపరమైన పనులపట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.  ఇంట్లో ఒకరకి అనారోగ్య సమస్యలున్నాయి. భగవంతుడిని పూజించడం వల్ల మానసిక, ఆధ్యాత్మిక ప్రాశాంతత లభిస్తుంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల భావోద్వేగాలతో పోరాడుతారు. కొన్ని శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ALso Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం..వీరు శుభవార్తలు వింటారు..ఆ రాశుల వారు మాత్రం దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడం మంచిది

కర్కాటకం

మీ సామర్థ్యానికి అనుగుణంగా ఫలాలు అందుకుంటారు. సోమరితనం విడనాడండి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు మీ ప్రస్తుత కార్యాలయంలో ఏదైనా సమస్యల్లో ఉంటే ఉద్యోగం మారేందుకు కూడా ఇదే అనుకూల సమయం.

సింహం

సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దలపై విధేయత చూపడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి.ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి.

కన్య

ఈ రోజు మీ బంధువులు, స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఎవరి మాటలో విని ఈ రోజు కొత్త ప్రణాళికలు ప్రారంభించవద్దు. స్నేహితులతో సమయం గడుపుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ వాతావరణ బావుంటుంది.

Also Read: మొన్న న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లండ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్!

తులారాశి

ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు పోటీ రంగంలో ఊహించని విజయం రావచ్చు. ఉద్యోగస్తులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ కుటుంబం కోసం సమయం వెచ్చించండి. రోజు సాధారణంగా ప్రారంభమైనా ముగింపు సంతోషంగా ఉంటుంది.

వృశ్చికం

ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి విజయం సాధిస్తారు. మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మంచి ఫలాలు పొందుతారు. మీ ప్రయత్నానికి, కృషికి ఇంటా బయటా సరైన గుర్తింపు లభిస్తుంది. మీ శత్రువులపై మీరు పై చేయి సాధిస్తారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.

ధనుస్సు

కష్టపడి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ పని తలపెట్టినా ఆలోచన లేకుండా దూకుడుగా వెళ్లొద్దు. అదృష్టం కలిసొస్తుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు.

Also Read: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు భేష్.. ఫైజర్ ప్రకటన

మకరం

ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.  వేరొకరి కారణంగా మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కొంతమంది మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు. ఇలాంటివారికి దూరంగా ఉండండి. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం మీకుంటుంది..అందుకే పనిపై దృష్టి సారించడి.

కుంభం

ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు. భగవంతుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్పం బలంగా ఉండడంతో అన్నింటా విజయం సాధిస్తారు. అపరిచితులను వెంటనే నమ్మవద్దు.

మీనం

ఇంటి సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. మీ భాగస్వామి ప్రవర్తన చాలా గందరగోళంగా ఉంది. చాలా కాలం తర్వాత, మీరు ఒక పరిచయస్తుడిని కలుసుకుంటారు. కొత్త పనులకు సంబంధించి ప్రణాళికలు వేసేందుకు అనుకూల సమయం. మీ ఆరోగ్యం బావుంటుంది. అతిగా ఆలోచించడం వలన ఒత్తిడికి గురవుతారు.

Also Read: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా బేబీ రాణి మౌర్య, దిలీప్ ఘోష్‌లు నియామకం..

 

Published at : 21 Sep 2021 06:37 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 21 September 2021

సంబంధిత కథనాలు

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Horoscope Today 18 August 2022:   ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!

Krishna Janmashtami 2022:  శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!

Sri Krishna Tatvam : శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం

Sri Krishna Tatvam : శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం

Krishna Janmashtami 2022: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు

Krishna Janmashtami 2022: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు

టాప్ స్టోరీస్

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !