News
News
X

Horoscope Today : ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించవద్దు…ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి బావుంటంది

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

ఆగస్టు 29 ఆదివారం రాశిఫలాలు

మేషం

ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నించవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులు విజయం సాధిస్తారు.

వృషభం

వ్యాపారం పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. విద్యార్థులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. అనవసర ప్రసంగాన్ని నియంత్రించండి.

మిథునం

అదృష్టం కలిసొస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లలు సమస్యలు పరిష్కారమవుతాయి. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

Also read:తలకు గాయం.. చిందే రక్తం.. అయినా ఆగని షూటింగ్‌.. ప్రియాంక ఫొటో వైరల్‌తలకు గాయం.. చిందే రక్తం.. అయినా ఆగని షూటింగ్‌.. ప్రియాంక ఫొటో వైరల్‌

కర్కాటక రాశి

స్నేహితులను, బంధువులను కలుస్తారు. శుభవార్త వింటారు. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరి నుంచైనా సహాయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ధైర్యంగా ఉండండి.

సింహం

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బాగా అలసిపోతారు.  శత్రువులు మీపై విజయ సాధిస్తారు.  ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పెద్దలు ఆశీర్వదించబడతారు.

కన్య

మీ సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు శుభసమయం. కొత్త వ్యక్తులను కలుస్తారు. వివాదాల్లో తలదూర్చకండి. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు.

Also Read: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!

తులారాశి

ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపార పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. యువత తమ కెరీర్ కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఒకరి మాటలు బాధ కలిగించవచ్చు. ఒత్తిడి తగ్గించుకోండి. వివాహితులు సంతోషంగా ఉంటారు. పిల్లలతో సమయం గడుపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండండి.

వృశ్చికరాశి

కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అధిక పని కారణంగా బాగా అలసిపోతారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. రుణాలు ఇవ్వడం మానుకోండి. నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు బంధువుల నుంచి శుభవార్తలు పొందవచ్చు. ప్రయాణాలు చేసేముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు

మీ జీవిత భాగస్వామితో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితులను కలుస్తారు. ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయి. యువత విజయం సాధిస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంఘర్షణ పరిస్థితులకు దూరంగా ఉండండి. వ్యాపారం బాగా జరుగుతుంది.

Also Read:పుష్ప రాజ్‌ని ఢీ కొట్టబోతోన్న IPS భన్వర్ సింగ్ షెకావత్.. తగ్గేదే లే అన్నట్టున్న ఫహద్ ఫస్ట్ లుక్..

మకరం

వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. ఈ వారం ప్రయాణాన్ని వాయిదా వేయండి. ప్రత్యర్థులు ఓడిపోతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీరు అప్పుల నుంచి బయటపడతారు. రుణాలు ఇవ్వొద్దు. ఆర్థిక పెట్టుబడులు పెట్టొచ్చు.

కుంభం

ఆర్థిక పరిస్థితికి సంబంధించి గందరగోళం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ జంటకు వారం అనుకూలంగా ఉంటుంది.  కొత్త ప్రణాళికలు వేస్తారు. అనవసర ఖర్చులుంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మిత్రుల సహకారం ఉంటుంది. యువత విజయం సాధిస్తుంది. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది .

మీనం

ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉండదు. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. రిస్క్ తీసుకోకండి. సోమరితనం వీడండి.

Also Read:అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు

Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!

Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు

 

Published at : 29 Aug 2021 06:10 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 29

సంబంధిత కథనాలు

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Horoscope Today 5th October 2022: ఈ దసరా ఈ రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది, అక్టోబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th  October 2022:  ఈ దసరా ఈ రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది, అక్టోబరు 5 రాశిఫలాలు

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

టాప్ స్టోరీస్

National Party: పేరు మారిస్తే జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

National Party:  పేరు మారిస్తే  జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?