News
News
X

Horoscope Today : ఈ రాశులవారు అవసరమైన వారికి సహాయం చేస్తారు... వాళ్లు మాత్రం ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

ఆగస్టు 28 రాశిఫలాలు 

మేషం

మేషరాశివారు ఈరోజు కొత్తగా ఏపనులూ ప్రారంభించవద్దు. వ్యాపారులకు ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇంటి బాధ్యతలు భారంగా మారతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం.

వృషభం

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే పనులు కలిసొస్తాయి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. రిస్క్ తీసుకోవద్దు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం ఈరోజు చేతికందుతుంది. కాలు లేదా వెన్నునొప్పితో కాస్త ఇబ్బంది పడతారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. 

మిథునం

ఈ రోజు ఉరకల పరుగుల రోజవుతుంది.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులను కలుసుకోవచ్చు. కొత్త సమాచారాన్ని పొందుతారు.

కర్కాటక రాశి

ఈ రోజు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది.  విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రిస్క్ తీసుకోకండి. 

Also Read: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం

సింహం

ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారస్తులకు శుభసమయం..కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. 

కన్య

ఈ రోజు మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. పిల్లలకు సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త వహించండి. వేరేవారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో శుభవార్త వింటారు. 

తులారాశి

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పని ప్రదేశంలో గౌరవం పొందుతారు. కొన్ని రోజులుగా  అసంపూర్తిగా  ఉన్న పని పూర్తవుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మంచి రోజు. ఈ ఒక్కరోజులోనే చాలా పనులు పూర్తిచేస్తారు. 

వృశ్చికరాశి

వ్యాపారం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.  జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రిస్క్ తీసుకోవడం మానుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. 

Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….

ధనుస్సు

మీరు పని తీరును మార్చుకుంటే  ప్రశంసలు అందుకుంటారు. అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు. సమాజానికి సంబంధించిన పని చేస్తారు. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి.  ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. 

మకరం

కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. సామాజిక గౌరవం లభిస్తుంది. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో ఆహ్లాదంగా ఉంటారు. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. సమయానికి బాధ్యతను పూర్తి చేయగలరు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. 

కుంభం

ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కార్యాలయంలో ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. జీవిత భాగస్వామితో అభిప్రాయబేధాలు ఉండొచ్చు. రిస్క్ తీసుకోకండి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. శత్రువు చురుకుగా ఉంటాడు. 

మీనం

వ్యాపారులకు కొన్ని సమస్యలు తప్పవు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువుని ఓడిస్తారు.  కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. అవసరమైన వారికి సహాయం చేయండి.  మనశ్శాంతి కోసం ధ్యానం చేయండి.

Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!

Also Read: రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా?

Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?

Published at : 28 Aug 2021 02:21 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 28

సంబంధిత కథనాలు

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Navratri 2022: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Navratri 2022:   ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Zodiac signs: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

Zodiac signs: ఈ రాశులవారికి  సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

టాప్ స్టోరీస్

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి