Horoscope Today: ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి… ఆ మూడు రాశుల వారూ శుభవార్తలు వింటారు..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 ఆగస్టు 23 సోమవారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..
మేషం
పెద్దల సలహాలు పాటించండి. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులతో పెద్దగా చర్చలు వద్దు. కొత్త సమాచారం తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
వృషభం
ఈ రోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అవకాశం ఉన్నంత వరకూ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్టుబడి పెట్టొచ్చు. విద్యార్థులకు బాగనే ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
మిథునం
కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య రావొచ్చు. ప్రమాదకరమైన పనులు చేయవద్దు. కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. బంధువులను కలుస్తారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. యువత కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి.
సింహం
బంధువుల నుంచి దుర్వార్తలు వినే అవకాశం ఉంది. చేసే పనులు పెద్దగా కలసిరావు. కుటుంబ సభ్యుల సహాయంతో, కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. చేపట్టిన పనిని సకాలంలో పూర్తిచేయండి. కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కన్య
ఈ రోజంతా ఉత్సాహంగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు. ఉద్యోగస్తులకు శుభసమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
తులారాశి
ఆర్థికంగా కలిసొచ్చే రోజు. భగవంతుడిని పూజించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఇంట్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పని ప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలరు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
వృశ్చికరాశి
ఈరోజంతా చికాకుగా వ్యవహరిస్తారు. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. యువతకు కెరీర్ కి సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఊహించని ఖర్చులు మీ ఇంటి బడ్జెట్‌ను పాడు చేసే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు అవుతుంది.
ధనుస్సు
కోపాన్ని నివారించండి. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రణాళికలు వేసుకనే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోండి. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు.
మకరం
మీకు అదృష్టం కలిసొస్తుంది. పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సోమరితనం విడిచిపెట్టండి. ఉద్యోగస్తులకు శుభసమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభం
విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆఫీసులో ఉన్నతాధికారితో వివాదం ఉండొచ్చు. యువతకు మంచి రోజు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. పనిని సులభంగా పూర్తి చేస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. దినచర్యలో మార్పు ఉంటుంది. యోగా వ్యాయామం అవలంబించండి.
మీనం
ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మాటల వల్ల మీరు బాధపడవచ్చు. శత్రువులు చురుకుగా ఉంటారు. ఈ రోజు బిజీగా ఉంటుంది. కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దంపతులు సంతోషంగా ఉంటారు.
Also Read: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
Also Raed: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…