By: RAMA | Updated at : 09 Apr 2023 05:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
ఈ రాశివారు ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసి తప్పుచేయవద్దు. ఇంట్లో శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల సమస్యలను అర్థం చేసుకోండి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
ఈ రాశి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మీకు కలిసొస్తాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి పెళ్లి గురించి చర్చలు ఉండొచ్చు. తోడబుట్టినవారితో సత్సంబంధాలు మెంటైన్ చేయండి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచి రోజు అవుతుంది.
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకతప్పదు. పనికిరాని విషయాలపై శ్రద్ధ పెట్టవద్దు. రహస్య విషయాలను అధ్యయనం చేయడంపై మీకు ఆసక్తి పెరుగుతుంది.మీ ప్రత్యర్థులతో కూడా మీరు బాగానే ఉంటారు, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మీ కీర్తి పెరుగుతుంది
ఈ రాశివారి ఆలోచన సామాజిక సేవలో నిమగ్నమై ఉంటుంది. చిన్నపాటి ఒత్తిడులు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు ..జాగ్రత్త. విద్యార్థులు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరిచ్చే సలహాలతో మీ చుట్టూ ఉండేవారు ప్రయోజనం పొందుతారు. మీ మంచి అలవాట్లు మీ గుర్తింపును పెంచుతాయి. మీ మనసులో మాటను స్నేహితులతో పంచుకుంటారు.
ఈ రాశివారు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. మీ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులు మిమ్మల్ని కలిసేందుకు వస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాల వల్ల ప్రయోజనం పొందుతారు.
Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!
జీవిత భాగస్వామితో సంతోష క్షణాలను ఆస్వాదిస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహాలు నిశ్చయమవుతాయి. మీరు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ప్రభుత్వ పనులలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారు.
ఏదైనా సమస్య గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు...ఏం మాట్లాడాలో సిద్ధంగా ఉండాలి. ఇది మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో కొత్త పురోగతికి అవకాశాలు లభిస్తాయి. వివాహబంధం బావుంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు. ప్రాణ స్నేహితుల మద్దతు లభిస్తుంది. అతి విశ్వాసం నష్టానికి దారి తీస్తుంది.
ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. పనిని మీరు అనుకున్నట్టు పూర్తిచేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఈ రోజు మీరు ఏదో విషయం గురించి గందరగోళానికి గురవుతారు. మీ ఆలోచన ప్రకారం పనులు జరగవని గుర్తుంచుకోవాలి. విద్యార్థులలో ఏకాగ్రత లోపిస్తుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, పనికిరాని పనులకు సమయం వృధా చేయవద్దు.
మీ బాధ్యతలు పెరుగుతాయి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. ఆదాయ స్థానం బలంగా ఉంటుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పాత మిత్రుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. పని తీరులో మార్పులు తీసుకురాగలరు.
నిర్వహణ సంబంధిత పనులలో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్యలు తీరుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికపరిస్థితి బావుంటుంది.
Also Read: మానసిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వివాదాలు - శుక్రుడి సంచారం ఈ 6 రాశులవారికి అస్సలు బాలేదు
పాత కేసులు బయటపడే అవకాశం ఉంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగొద్దు. సమయాన్ని వృధా చేయొద్దు.
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!
కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!