Telangana man shot dead in America: ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
US Palamuru Man Murder: ఇస్లామోఫోబియాతోనే పాలమూరు యువకుడ్ని అమెరికా పోలీసులు కాల్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. షూట్ చేసిన పోలీస్ ఆఫీసర్ని సెలవులో పంపి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

American police shoot Palamuru young man: అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ టెకీని పోలీసులు కాల్చి చంపిన ఘటనపై దుమారం రేగుతోంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి కారణం అయిన నల్లజాతీయుడ్ని పోలీసులు హత్య చేసినట్లుగా.. పాలమూరు యువకుడు నిజాముద్దీన్ పై పోలీసులు కాల్పులు జరిపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం ఇస్లామోఫోబియా అనే అభిప్రాయం వినిపిస్తోంది. కాల్పులు జరిగిన ఆఫీసర్ ను సెలవులో పంపిన ఉన్నతాధికారులు.. అసలు కాల్చి చంపాల్సిన అవసరం వచ్చిందా లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ఇది జరిగి రెండు వారాలు అవుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mohammed Nizamuddin, a thirty-two-year-old Telangana student, was shot dead by Santa Clara, California
— Sumit (@SumitHansd) September 19, 2025
Md Nizamuddin from Telengana "stabbed" his roommate with a knife in California
- Police shot him dead
- Now his father is demanding Indian govt to bring his body back pic.twitter.com/G2wEwnmmky
30 ఏళ్ల మొహమ్మద్ నిజాముద్దీన్ శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. ఆయన నివాసం ఉంటున్న ఇంటి నుంచి పోలీసులకు ఓ కాల్ వచ్చింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేస్తున్నాడని ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు కత్తి పట్టుకుని కనిపించిన నిజాముద్దీన్ పై కాల్పులు జరిపారు. దాంతో అతను చనిపోయాడు. ఇతర రూమ్మేట్స్ తో కలిసి ఓ ఇంట్లో నిజాముద్దీన్ ఉంటున్నాడు. నిజాముద్దీన్ చేతిలో కత్తితో ఓ యువకుడి వైపు వెళ్తూండగా పోలీసులు నాలుగు సార్లు కాల్పులు జరిపాడని.. బుల్లెట్లు అన్ని నిజాముద్దీన్‌కు తగిలాయని స్థానికులు చెబుతున్నారు. హౌస్ ఓనర్ కూడా నిజాముద్దీన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. నిజాముద్దీన్ రెంట్ టైమ్‌కు చెల్లించేవాడు కానీ, ఇటీవల చాలా సమస్యలు సృష్టిస్తున్నాడని పోలీసులకు చెప్పారు. "షార్ట్-టెంపర్డ్ , ట్రబుల్ మేకర్.. అని.. ఇంటి నుంచి ఖాళీ చేయించే ప్రాసెస్‌లో ఉన్నామన్నారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ కుటుంబం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2017లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ పూర్తి చేసి, సాంతా క్లారాలో టెక్ ఫర్మ్‌లో పనిచేస్తున్నాడని కుటుంబసభ్యులుచెబుతున్నారు. అయితే అమెరికాలో నిజాముద్దీన్ వేధింపులు ఎదుర్కొన్నట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆయన పోస్టుల్లో, "వైట్ సుప్రెమసీ/రేసిస్ట్ వైట్ అమెరికన్ మెంటాలిటీ ఆగాలి. ఎనాఫ్ ఈజ్ ఎనాఫ్" అని రాసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల "నా ఫుడ్‌ను పాయిజన్ చేశారు, ఎవిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, రేసిస్ట్ డిటెక్టివ్ టీమ్‌తో సర్వైలెన్స్ చేస్తున్నారు" అని కూడా పోస్ట్ చేశాడు.
#WATCH | Mahabubnagar, Telangana: A family from Mahabubnagar city is seeking assistance from the Indian and Telangana state governments to bring back the body of their son, Mohammad Nizamuddin, who was allegedly killed in a police shootout in California, USA, where he had gone… pic.twitter.com/Zl8Y6BGOaa
— ANI (@ANI) September 19, 2025
నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. శవాన్ని సాంతా క్లారా ఆసుపత్రిలో ఉంచారు. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్ సహాయం చేయాలని కోరుతున్నారు. రొసీజర్ మొదలైంది కానీ టైమ్ పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.





















