Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరలేదు, కలిసి పని చేస్తున్నా- కడియం శ్రీహరి సంచలన కామెంట్స్
Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్టు మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.

Kadiyam Srihari: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరైన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ బీఅర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 36 మంది శాసన సభ్యులను పార్టీలో చేర్చుకొని అందులో ఇద్దరికీ మంత్రి పదవి కూడా ఇచ్చారని కడియం శ్రీహరి గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని కాంగ్రెస్‌తో నడవడం జరుగుతుందని కడియం క్లారిటీ ఇచ్చారు. గత పదిహేను సంవత్సరాలుగా స్టేషన్ ఘాన్ పూర్ నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని కొంతైనా పూడ్చవచ్చని కాంగ్రెస్‌తో పని చేస్తున్నానని, ఉపముఖ్యమంత్రిగా ఉన్నని రోజులు నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని కడియం శ్రీహరి అన్నారు. కేసీఅర్ డిల్లీలో ఉన్న తనను పిలిచి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఆయన తెలిపారు.
రాజకీయ వ్యవస్థను భ్రష్టు పాటించారు
రాజకీయ వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించారని కడియం శ్రీహరి ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో వివిధ పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను బీ అర్‌ఎస్‌లో చేర్చుకున్నారని అందులో శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి మంత్రిపదవులు ఇచ్చారని కడియం గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఎవరితో రాజీనామా చేయించలేదని తెలిపారు. సభ్యత్వం రద్దు కాలేదని కడియం అన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ఫాం హౌస్‌కు పరిమితమైన కేసీఅర్‌కు ఇప్పుడు రాజకీయాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా అని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తెలంగాణాను ఆగమం చేశారని కడియం ఆరోపించారు. నేను రాజకీయాల్లో ఎవరికీ పాదాభివందనం చేయలేదని.. నీతి.. నిజాయితీతో రాజకీయాల్లో ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు.
స్పీకర్ పరిధిలో ఎమ్మెల్యేల అంశం
పార్టీ మారారని బీఅర్‌ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లిందని కోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే తప్ప, సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పలేదని కడియం శ్రీహరి అన్నారు. స్పీకర్ తనకు వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చారనీ వివరణ ఇచ్చే సమయంలో ఉందని కడియం చెప్పారు. ఏదీ ఏమైనా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు
ఫిరాయింపులను వ్యతిరేకం
పార్టీ ఫిరాయింపులకు కడియం శ్రీహరి వ్యతిరేకమని, వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించబోనని కడియం అన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి కోసం తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వస్తుందని కడియం చెప్పారు. నేను పార్టీలో ఉన్నాననే స్పీకర్ చెబుతానని కడియం చెప్పారు.
నాకు కూడా బూతులు వచ్చు..
మెడిసిన్ చదువుకొని కొంతమంది సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ విమర్శలు ఉండాలే కానీ వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని పరొక్షంగా రాజయ్యకు చురకలంటించారు. నాకు బూతులు వచ్చు.. మాటలు వచ్చు, పుట్టింది అదే కాలనీలోనేనని కడియం అన్నారు. తాను మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డు వస్తుందని తెలిపారు. వాళ్ళ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. 15 సంవత్సరాలు అధికారంలో ఉండి చిలిపి పనులు, దళిత బంధు, బి ఫాం అమ్ముకున్న వ్యక్తులతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజయ్యపై మండిపడ్డారు.
ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నా
స్టేషన్ అభివృద్ధికి సీఎం చొరవ తీసుకున్నారన్నారు కడియం. 148 కోట్లు దేవాదుల ఉప కాల్వల కోసం నిధులు ఇచ్చారన్నారు. దీనివల్ల చివరి ఆయకట్టు వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయని వివరించారు. తొలిసారి అనేక చెరువులు నింపుకున్నామని సవరించిన 1015 కోట్లతో ప్యాకేజీ 6తో రిజర్వాయర్లు, చెరువులు నింపనున్నామన్నారు. గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఇదంతా కాంగ్రెస్ వల్ల సాధ్యమైందని తెలిపారు. స్టేషన్ ను ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని కడియం తెలిపారు.





















