Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
Madanapalle RDO Murali Arrest | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని ఏపీ సీఐడీ పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేశారు.

తిరుపతి: మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలోని తన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు మురళికి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన క్రమంలో ఈ అరెస్ట్ జరిగింది. గతేడాది జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఫైల్స్ దగ్ధం ఘటనలో పలు ముఖ్యమైన రికార్డులు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఈ కేసులో మురళి పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
2022 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పని చేసిన మురళి, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దగ్ధం అయ్యాయి. ఈ కేసులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. మురళి జూన్ 2న సుప్రీంకోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందగా, తాజాగా సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేయడంతో పోలీసులు మాజీ ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేశారు.
కేసు పరిణామాలు
2024 జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ కేసులో మురళి నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నా, పూర్తి స్థాయిలో సాక్ష్యాలు లభ్యం కాలేదు. మరిన్ని వివరాలను సేకరించడం కోసం మాజీ ఆర్డీఓ మురళిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్థిక మోసాలు, దస్త్రాల దహనం:
ఈ కేసులో ఆర్థిక మోసాలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రికార్డులు దగ్ధం కావడంతో, ఆ డాక్యుమెంట్లలో ఉన్న కీలక సమాచారం దొరకకపోవడంతో వివిధ శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఆర్డీవో మురళి అరెస్టు కీలకంగా మారింది. మురళి త్వరలోనే కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది.
సుప్రీంకోర్టు బెయిల్ రద్దు
సుప్రీంకోర్టు జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గురువారం నాడు మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో శుక్రవారం నాడు సీఐడీ పోలీసులు మురళీని అరెస్ట్ చేశారు. మరోవైపు సీఐడీ పోలీసులు మురళి పై దర్యాప్తు కొనసాగిస్తుండగా, కస్టడీకి తీసుకున్నాక ఫైల్స్ దగ్దం కేసులో అతని పాత్రపై క్లారిటీ రానుంది.






















