Khammam Crime News: ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు
Khammam Crime News: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావును దుండగులు గొంతు కోసి హత్య చేశారు.

Khammam Crime News: ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. ఒక పార్టీ లీడర్‌ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో కలకలం రేగింది. స్థానిక ఎన్నికలు రానున్న టైంలో ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నాయకుడు సామినేని రామారావును దుండగులు చంపేశారు. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా ఆయన్ని హత్య చేశారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. స్థానికంగా అందరితో కలిసిపోయిన రామారావు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగలరని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు.
రామరావు హత్య గురించి తెలుసుకున్న ప్రభుత్వ అలర్ట్ అయ్యింది. వెంటనే కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారు. కేసును విలైన త్వరగా ఛేదించి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు.





















