Sai Durgha Tej : ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
Sambarala Yetigattu : సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కొత్త మూవీ చేయబోతున్నారంటూ వస్తోన్న రూమర్లపై ఆయన టీం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది.

Sai Durgha Tej Clarifies About Rumours On New Movie : సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా హై లెవల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సంబరాల ఏటిగట్టు'తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మరో సీక్వెల్‌లో నటించబోతున్నారంటూ వస్తోన్న రూమర్లపై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. 2021లో వచ్చిన 'రిపబ్లిక్' మూవీ సీక్వెల్ చేసేందుకు సాయి తేజ్ ఓకే చెప్పారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవమని టీం క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం హీరో ఫోకస్ అంతా 'సంబరాల ఏటిగట్టు' ప్రాజెక్టుపైనే ఉందని... ఆయన ఎలాంటి కొత్త మూవీ చేయడానికి అంగీకరించలేదని స్పష్టం చేసింది. సాయి దుర్గా తేజ్ మూవీస్‌కు సంబంధించి ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన నటించబోయే ఏ మూవీస్ అయినా అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్‌ను పీఆర్ టీం వెల్లడిస్తుందని చెప్పాయి.
Also Read : ఓటీటీలో కొత్త లోక Vs కాంతార చాప్టర్ 1 - ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్స్... మీరు ఏ మూవీ చూస్తారు?
ఇక సంబరాల ఏటిగట్టు విషయానికొస్తే... ఇదివరకూ ఎన్నడూ చూడని రోల్‌లో పవర్ ఫుల్‌గా సాయి దుర్గా తేజ్ కనిపించబోతున్నారు. 'విరూపాక్ష' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆయన హీరోగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా... ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో బలమైన ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాగా మూవీ రూపొందుతోంది.
మూవీలో సాయి తేజ్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ విలన్ రోల్ చేస్తుండగా... భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫేమస్ ఫైటర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్పెషల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేయగా... రీసెంట్‌గా రిలీజ్ అయిన 'అసుర ఆగమనం' గ్లింప్స్ ఆ హైప్ పదింతలు చేసింది. మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ కాగా... మరో రెండు షెడ్యూల్స్ షూటింగ్ చేయాల్సి ఉంది.
రిలీజ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది ప్రథమార్థంలో 'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.





















