అన్వేషించండి

Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  

Montha Cyclone Damage: మొంథా తుపాను ధాటికి తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితిని గమనించి రైతులకు భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు కేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు.

Montha Cyclone Damage: మొంథా తుపాను (Cyclone Montha) తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమించి, పంట ఇంటికి వస్తున్న టైంలో ఈ తుపాను రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న టైంలో నేలపాలైన పైరును చూసిన అన్నదాతలు బోరుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.  ఏకంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ పెను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని రైతులు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదటపడుతోంది. ఇళ్లల్లోకి చేరిన బురదను తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం పర్యటించనున్నారు.  

Image
 
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం, తుపాను ప్రభావం రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 179 మండలాలపై పడింది. ఈ నష్టం కారణంగా మొత్తం 2,53,033 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అత్యధికంగా వరి, పత్తి పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. వరి పంట ఏకంగా 2,82,379 ఎకరాల్లో దెబ్బతినగా, పత్తి పంట 1,51,707 ఎకరాల్లో నష్టపోయింది.
నష్ట తీవ్రత జిల్లాల వారీగా పరిశీలిస్తే, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే అత్యధిక నష్టం జరిగింది. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 1,30,200 ఎకరాల్లో పంట దెబ్బతింది. తర్వాత ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట మునిగింది. ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ నష్టం తీవ్రంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.  

Image

సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  చెప్పారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనాలు అందిన తరువాత, ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై సీఎంతో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. తక్షణ సాయంగా రూ.10 వేల పరిహారాన్ని మంత్రి ప్రకటించారు.  

Image

పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో లక్షల ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరి కోత సమయంలో నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గుతుందనే భయం వారిని వెంటాడుతోంది. కల్లాల్లో, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. 

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఒక మహిళా రైతు వీడియోను షేర్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తారవ్వ అనే మహిళా రైతు అధికారుల కాళ్లు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేయడం, ఈ భారీ వర్షాలు రైతులకు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో అర్థం చేసుకోవడానికి ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం ఏ మాత్రం సరిపోదని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టం నీటిపాలైన రైతులను ఆదుకోవాలంటే, ఒక్కో ఎకరాకు కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

కేవలం పరిహారం మాత్రమే కాకుండా, ఈ కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అదనపు భరోసా కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు. యాసంగి పంటల సాగు కోసం రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, తక్షణమే రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటన 

తుపాను బాధితులకు భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీఎం పర్యటన తుపాను ప్రభావిత జిల్లాల్లో జరుగుతుందని మంత్రి తుమ్మల గతంలోనే ప్రకటించారు. దానిలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గ్రేటర్ వరంగల్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరిన సీఎం, ముందుగా హుస్నాబాద్, వరంగల్‌లో వరద దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వరంగల్ నగరంలోని మూడు ప్రధాన కాలనీలలో పర్యటిస్తారు. ముంపుకు బాధితులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి వరద నష్టం, సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడే తుది పరిహారంపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget