Meta Ray-Ban Glasses Demo Failure | 43,500 ధరతో మెటా కొత్త స్మార్ట్ గ్లాస్సెస్
టెక్నాలజీ దిగ్గజం మెటా సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఓక్లే మెటా వాన్‌గార్డ్. ఓక్లే మెటా HSTN మోడల్‌కు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్. ఈ స్మార్ట్ గ్లాసెస్ మన ఇండియన్ కరెన్సీలో 43,500 వరకు ఉంటుంది. ఈ గ్లాస్సెస్ ను ప్రత్యేకంగా రన్నర్లు, సైక్లిస్టుల కోసం రూపొందించారు. అయితే అన్యువల్ మెటా కనెక్ట్ ఈవెంట్‌లోనే ప్రీమియం మెటా రే-బాన్ గ్లాసెస్‌ను ఇంట్రడ్యూస్ చేసారు. CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇది ఎలా పనిచేస్తుందో చూపించాలని అనుకున్నారు. కానీ లైవ్ లో వరుసగా 2 డెమోస్ ఫెయిల్ అయ్యాయి.
కొత్త మెటా రే-బాన్ గ్లాసెస్‌ను ఆవిష్కరించిన తర్వాత, జుకర్‌బర్గ్ ఫుడ్ క్రియేటర్ జాక్ మన్‌కుసోతో కనెక్ట్ అయ్యి ... డైలీ లైఫ్ లో ఈ కొత్త గ్లాస్సెస్ ఎలా ఉపయోగపడతాయో చూపించాలని అనుకున్నారు. ఒక కొరియన్ రెసిపీ తెలుసుకోవడం కోసం మన్‌కుసో ఈ గ్లాసెస్‌ను ఉపయోగించాడు. స్టెప్ బై స్టెప్ ఈ గ్లాస్సెస్ సజెషన్ ను ఇవ్వాలి. కానీ ఆలా జరగలేదు. మన్‌కుసో వేసుకున్న AI గ్లాసెస్ ... ఎదో ఆలా రాండమ్ డైరెక్షన్స్ ను ఇవ్వడం మొదలు పెట్టింది. మాన్‌కుసో ఈ AI ని రీ డైరెక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై కూడా చేసాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాంతో Wi-Fi బాలేదు అంటూ.. జుకర్‌బర్గ్‌కు అప్పచెప్పేసాడు ఫుడ్ క్రియేటర్ జాక్ మన్‌కుసో.
జుకర్‌బర్గ్ ను కూడా ఈ గ్లాస్సెస్ బాగా ఇబ్బంది పెట్టాయి. మెటా CEO ఈ గ్లాస్సెస్ నుంచి కాల్స్ ని కూడా ఆన్సర్ చేయలేక పొయ్యారు. మొత్తానికి ఈ తప్పు Wi - Fi ది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపొయ్యారు.
అయితే ఈ గ్లాస్సెస్ లో అడ్వంస్డ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో 3కే వీడియో రికార్డింగ్ చేయగల 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఆడియో కోసం ఐదు మైక్రోఫోన్ సిస్టం, విండ్ నాయిస్ ని తగ్గించే టెక్నాలజీ, డస్ట్... వాటర్ ప్రొటెక్షన్ కోసం ఐపీ67 రేటింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఈ గ్లాస్సెస్ లో ఉంటాయి. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే 9 గంటల పాటు చేస్తాయి. అలాగే చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేవలం 20 మినిట్స్ లో 50 % వరకు ఛార్జ్ అవుతుంది. రే-బాన్ మెటా 2, యాప్స్, లైవ్ ట్రాన్స్‌లేషన్ కోసం బిల్డ్ ఇన్ డిస్‌ప్లేతో ఈ గ్లాసెస్‌ను రిలీజ్ చేసారు. అయితే డెమోలోనే ఈ గ్లాస్సెస్ ఇలా ఫెయిల్ అవడంపై విమర్శలు మొదలైయ్యాయి. ఈ విషయాన్ని మెటా సంస్థ సీరియస్ గా తీసుకోని కొత్త సిరీస్ తో వస్తుందా.. లేదా ఇంకేమన్నా చేస్తారా లేదా అన్నది చూడాలి.






















