అన్వేషించండి

ఏప్రిల్ 5 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఆదాయం - ఆ రాశువారికి అద్భుత అవకాశం

Rasi Phalalu Today 5th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

ఏప్రిల్ 5 రాశిఫలాలు

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆదాయం బావుంటుంది..అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన పని చేయడం వల్ల రోజంతా సంతోషంగా ఉంటారు. అయితే వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవ్వరి దగ్గరా అప్పు తీసుకోవద్దు...లేదంటే..తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు.  

వృషభ రాశి
ఈ  రోజు ఈ రాశివారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో ఏదో భయం ఉంటుంది. ఏ పనీ చేయాలని అనిపించదు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే దాన్ని మనస్ఫూర్తిగా పెట్టొచ్చు..ఈ రోజు పెట్టేపెట్టుబడుల వల్ల భవిష్యత్ లో లాభపడతారు. ప్రతి పనిలో ఎవరో ఒకర్ని   ఇన్వాల్వ్ చేయొద్దు. మీరు చేయాలనుకున్న పనిని చేయండి. పిల్లలతో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.
 
మిథున రాశి 
ఈ రాశివారు ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు.  విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ఉన్నత అవకాశం పొందుతారు..కానీ..మీరు పాత ఉద్యోగంలోనే కొనసాగడం మీకు మంచిది.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.  

కర్కాటక రాశి 
ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. పనిచేసే ప్రదేశంలో చర్చ జరిగే పరిస్థితి ఉంటే మీరు ఒకవైపు ఉండాలి ..లేదంటే పూర్తిగా దూరంగా ఉండాలి.  లేదంటే మీరు మాటలు పడాల్సి వస్తుంది. వ్యాపారం చేసేవారు ఆకర్షణీయంగా మాట్లాడగలగాలి. ఉద్యోగులు టార్గెట్లు పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో చిన్న పార్టీని ఎంజాయ్ చేస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామిని ఈ రోజు కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం మంచిది. మీరు ఊహించని సమస్యలు కొన్ని వస్తాయి.. అయి నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Also Read: మేష రాశిలో మూడు గ్రహాల కలయిన, ఈ మూడు రాశులవారికి కష్టాలే!

సింహ రాశి
ఈ రోజు మీ మనస్సులో ఉత్సాహం నెలకొంటుంది. కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. దీనివల్ల మీ అలసట, ఒత్తిడి దూరమవుతాయి. పనితో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు...ఎవరినీ దూషించకుండా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లకు  అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త.  కుటుంబ సభ్యులకు అనవసర వాగ్ధానాలు ఇవ్వొద్దు. 

కన్యా రాశి 
ఈ రోజు మీకు పురోభివృద్ధితో కూడిన రోజు అవుతుంది. వ్యాపారులకు ఈ రోజు మెరుగ్గా ఉంటుంది..ఎన్నాళ్ల నుంచో ఆగిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి. కానీ భాగస్వామ్య వ్యాపారం నడపాలి అనుకుంటే మాత్రం మీరు భాగస్వామిని గుడ్డిగా నమ్మకూడదు.  ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.   ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చెప్పుడు మాటలు విని ఎవ్వరితోనూ గొడవపడొద్దు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. 

తులా రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆశయం నెరవేరుతుంది. మీ మనసులో కొన్ని భావాలు జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు మీకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయాలి. విద్యార్థులు బలహీనమైన సబ్జెక్టులపై దృష్టి సారించాలి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. 

వృశ్చిక రాశి 
ఈ రోజు ఆరోగ్య పరంగా మీకు కొంత ఇబ్బంది కలిగించే రోజు...నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగితే మౌనంగా ఉండడం మంచిది. బెట్టింగులో డబ్బులు పెట్టేవారు ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది. తల్లిదండ్రులతో కలసి ఆధ్యాత్మిక ప్రాంతాలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది.  కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.  వేరేవారి ప్రోద్బలంతో పెట్టుబడులు పెడితే అది మీకు ఇబ్బందిగా మారొచ్చు. అకాస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. సాయంత్రం లోగా ముఖ్యమైన సమాచారం వింటారు. 

Also Read: ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

మకర రాశి
మీ చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతానం కొత్త ఉద్యోగం పొందారన్న వార్త మీలో సంతోషాన్ని పెంచుతుంది.  కుటుంబ సభ్యుల వివాహానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. పని ప్రదేశంలో అందరితో మంచిగా వ్యవహరిస్తారు. అనుకున్న పనిని సులభంగా చేయగలుగుతారు. కుటుంబంలో గొడవలు సర్దుమణగాలంటే కూర్చుని మాట్లాడడం మంచిది. పిల్లల భవిష్యత్తు పెట్టుబడి కోసం మీరు ప్లాన్ చేసుకుంటే తప్పక మీ జీవిత భాగస్వామిని సంప్రదించాలి.

కుంభ రాశి 
ఈ రోజు ఈ రాశివారు సోమరితనం వీడాలి. విద్యార్థులు పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు మాటతీరులో మాధుర్యాన్ని కాపాడుకోవాలి.  మీ తెలివితేటలు, మనస్సాక్షితో నిర్ణయాలు తీసుకుంటే వాటిలో తప్పకుండా విజయం సాధిస్తారు.  వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 

మీన రాశి 
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది.  మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకుంటారు కొన్ని బాధల బరువును దించుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబం నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని కోల్పోతారు...ఎందుకంటే మీకు తెలియకుండా ఆమె ఏదైనా పనిచేయడం మీకు కోపాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget