అన్వేషించండి

ఏప్రిల్ 27 రాశిఫలాలు, ఈరాశివారు సలహాలు ఇవ్వడం మానేసి మీ పని మీరు చేసుకుంటే మంచిది!

Rasi Phalalu Today 27th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

ఏప్రిల్ 27 రాశిఫలాలు

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు చాలా శ్రమతో కూడుకున్న రోజు. మీ బిజీ కారణంగా కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపలేరు, దాని కారణంగా కుటుంబ సభ్యులు మీపై కోపం తెచ్చుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తమ కొత్త డీల్‌లలో దేనినైనా ఖరారు చేసుకునే అవకాశాన్ని పొందుతారు, కానీ బయటి వ్యక్తులతో ఎక్కువగా పంచుకోకండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు సంక్లిష్టమైన రోజు. మీరు ఏ విషయంలోనూ తొందరపడకండి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి.  ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్ కారణంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది. మీరు మీ నిర్ణయాధికారానికి సంబంధించి పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. చట్టపరమైన విషయంలో ఎవరినీ అతిగా నమ్మవద్దు. లావాదేవీకి సంబంధించిన సమస్య ఈరోజు పరిష్కారమవుతుంది. 

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు మంచి రోజు కానుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించడం గురించి మీరు చర్చించవచ్చు. చర, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోండి, లేకుంటే మీరు దాని కారణంగా నష్టపోతారు.  పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

Also Read: మే 5న చంద్ర గ్రహణం, భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంది

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పరంగా బలహీనమైన రోజు. మీలో ఏదైనా పాత వ్యాధి బయటపడే అవకాశం ఉంది. ఎవరితోనైనా చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం అలాగే ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా ఉండండి. కర్మాగారాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి.కొత్త వాహనం కొనుగోలు చేయాలన్న మీ కల నెరవేరుతుంది. బడ్జెట్ వేసుకుని అమలు చేయాలి. కొత్త ఉద్యోగం ప్రారంభించే ఆలోచన చేయవచ్చు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం గురించి ఆందోళన చెందేవారు అనుభవజ్ఞులతో మాట్లాడండి. స్నేహితులతో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. వివాదాలు పెరగవచ్చు. మీ పనిపై మీరు శ్రద్ధ వహించండి, అప్పుడే అది సకాలంలో పూర్తవుతుంది. 

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు మంచి ప్రారంభం అవుతుంది. నిలిచిపోయిన పనులు తల్లిదండ్రుల ఆశీస్సులతో  సకాలంలో పూర్తిచేస్తారు. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు ఏర్పడితే అది కూడా సమసిపోతుంది. కొత్త ఇల్లు, దుకాణం, వాహనం  కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

తులా రాశి

తులా రాశి వారు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత విషయాలను అందరికి చెప్పకండి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి . ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెద్ద పెట్టుబ‌డుల‌కు సిద్ధ‌ప‌డుతున్న వారికి ఈ రోజు మంచి రోజు. స్థిరాస్తిని వృద్ధి చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.  పెద్ద సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్త అందుకుంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు పూర్తి విజయం ఉంటుంది. మీరు మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందితే..అది అనవసర ప్రయాస. కొత్త ఉద్యోగం చేయాలనే కోరిక కూడా ఈ రోజు నెరవేరుతుంది. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. మీరు ఏదైనా శారీరక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబానికి సమయం కేటాయించండి. 

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీలో పరస్పర సహకార భావన ఉంటుంది. మీ తల్లిదండ్రులను అడిగిన తర్వాత మీరు పని చేస్తే, అది మీకు మంచిది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి లాభం చేకూరుతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.

Also Read: ఏప్రిల్ 27 గంగా సప్తమి, గంగావతరణం గురించి ఈ పాటల్లో అత్యద్భుతంగా చెప్పారు

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. చాలాపనులు చేయాల్సి రావడం వల్ల గందరగోళంగా అనిపిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో మీకు విజయం సాధిస్తారు..మీ ప్రత్యర్థులు ఆధిపత్యం మాత్రం తగ్గదు. అనుకున్న పనులు పూర్తిచేయడంపై దృష్టి సారిస్తారు.ఇంటికి సంబంధించి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు. మీరు ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలను వింటూ ఉంటారు, ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని లేదా స్నేహితురాలిని కలుస్తారు. వైవాహిక జీవితంలో వివాదాలుంటే ఈ రోజు సమసిపోతాయి. ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళవచ్చు.

మీన రాశి

మీన రాశి వారు ఈరోజు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అనుకోకుండా ఓ పార్టీకి హాజరవ్వాల్సి రావొచ్చు.  పిల్లల కెరీర్‌కు సంబంధించి మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే అది తొలగిపోతుంది. సోదరులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు వ్యాపార సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget