Horoscope Today 25th December 2022: ఈ రాశివారు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చు,డిసెంబరు 25 రాశిఫలాలు
Rasi Phalalu Today 25th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 25th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులకు శుభసమయం.
వృషభ రాశి
ఈ రోజు విద్యా రంగంలో విజయానికి బలమైన అవకాశం ఉంది. మీ పిల్లల పురోగతిని చూసి మీ సంతోషం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది..తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
మిథున రాశి
మీరు కుటుంబంతో కలిసి ఏదో పనిలో బిజీగా ఉంటారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక లాభం ఉంటుంది. కొన్ని పనులకు మీకు ఎక్కువ సమయం పట్టవచ్చు.
కర్కాటక రాశి
ఈ రోజంతా మీరు టెన్షన్ గా ఉంటారు.మంచి భోజనం చేస్తారు. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది.
Also Read: 2023లో ఈ 5 రాశులవారిపై శుక్రుడి అనుగ్రహం - ఏడాదంతా ఆర్థికంగా తిరుగుండదు!
సింహ రాశి
మీ ప్రియమైన వారినుంచి నిజమైన ప్రేమను పొందుతారు. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రశాంతంగా వ్యూహాన్ని రూపొందించుకోవడం మంచిది.
కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి మరింత ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణం ఉండవచ్చు. డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
తులా రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది..రోజంతా సంతోషంగా ఉంటారు. మీ పనిలో విజయం ఉంటుంది. ఎవరికైనా అప్పిచ్చిన డబ్బు తిరిగి పొందుతారు
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మంచి పని సరైన సమయంలో జరుగుతుంది. కొత్త ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అవసరమైన వస్తువులు అందుతాయి.ప్రశాంతమైన మనస్సుతో పని చేస్తే మీరు ప్రయోజనాలు పొందుతారు.
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
ధనుస్సు రాశి
మీ రోజు పరిపూర్ణంగా ఉంటుంది. స్నేహితుని సహాయంతో మీ పనులు పూర్తిచేస్తారు. మీ విశ్వాసం ఆధారంగా దాదాపు ప్రతిపనిలో విజయం సాధిస్తారు. సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ సమస్యలన్నింటికీ మీరు సులభంగా పరిష్కారాన్ని కనుగొంటారు.
మకర రాశి
ఈ రోజు మీకు కలిసొస్తుంది. కొన్ని కొత్త అంశాలపై పని చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వివాహితులు జీవిత భాగస్వామితో కలహాలు జరుగుతాయి కానీ కాసేపట్లో మళ్లీ సర్దుకుంటాయి. మీరు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందలేరు.
మీన రాశి
మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కార్యాలయంలో ప్రశంసలు పొందడానికి కొంత సమయం పడుతుంది. వ్యాపారులు లాభపడతారు. అకస్మాత్తుగా కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు...జాగ్రత్త