Horoscope Today 24th November 2023: ఈ రాశివారి మాటలో మాధుర్యం మనసు చంచలం, నవంబరు 24 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. నవంబరు 24, 2023 శుక్రవారం కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి..
Horoscope Today 24th November 2023 (నవంబరు 24 రాశిఫలాలు)
మేష రాశి (Aries Horoscope in Telugu)
ఈ రాశివారు ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అధిక కోపం తగ్గించుకోవడం మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. మీరు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల విషయంలో ఆందోళనలు పెరుగుతాయి.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ కి అవాకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది కానీ స్థలం మార్పు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రచన , మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్త పొందవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు స్నేహితుని సహాయంతో ఉద్యోగంలో చేరుతారు.
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రాశివారి మనసులో ఆశ, నిస్పృహలు సమానంగా ఉంటాయి. అనవసర తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనవసరమైన కోపం తగ్గించుకుని సహనం పెంచుకోవాలి. అధిక ఖర్చులతో ఇబ్బంది పడతారు. పనిలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
Also Read: ప్రేమతో కూడిన హగ్ ఇవ్వడం ఓ ఆర్ట్ - ఇందులో ఈ రాశులవారు స్పెషలిస్టులు
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. స్నేహితుని సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది. ఉద్యోగ పరీక్షలు , ఇంటర్వ్యూలలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది కానీ ఏదో చికాకు ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు.
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ అంతలోనే ఏదో భయం ఆవహించినట్టు మారిపోతుంటారు. విద్యార్థులు ఇతర విషయాలపై శ్రద్ధ తగ్గించి చదువుపై దృష్టిసారించాలి. చేపట్టిన పనుల్లో ఆంటకాలు ఉండొచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. బాధ్యతలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం తగ్గుతుంది.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
మానసిక ప్రశాంతత ఉంటుంది. చదువులపై ఆసక్తి ఉంటుంది. విద్య, పరిశోధన, రచన, మేధోపరమైన పనిలో బిజీ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ అతి ఉత్సాహం తగ్గించుకోవడం మంచిది. పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరగవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఈ 5 రాశులవారికి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!
తులా రాశి (Libra Horoscope in Telugu)
మాటలో మాధుర్యం ఉంటుంది కానీ మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో అనవసర రాద్ధాంతం ఉండవచ్చు. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు. బహుమతులుగా అందుకోవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. పనిలో పెరుగుదల ఉండవచ్చు. ఆదాయం కూడా పెరుగుతుంది. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుని సహాయంతో ఆదాయ వనరులు పెరుగుతాయి. సహనం తగ్గుతుంది. పిల్లల సంతోషం పెరుగుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి.
Also Read: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
అనవసరమైన కోపం , తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో శాంతిని కొనసాగించేందుకు ప్రయత్నించండి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అధిక కోపం తగ్గించుకోవాలి. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు.ఈ రోజు మీరు ఏది చికాకులో ఉంటారు. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావచ్చు. అదనపు బాధ్యతను పొందుతారు.
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
మనసులో హెచ్చు తగ్గులు ఉంటాయి. సంభాషణలో ఓపికగా ఉండండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ సోమరితనం వెంటాడుతుంది. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఆదాయానికి, అదనపు ఖర్చులకు అంతరాయం ఏర్పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త...
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
సహనం కొనసాగించడానికి ప్రయత్నించండి. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మనసులో నిరుత్సాహ భావం కలగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు ఉంటుంది కార్యాలయంలో మార్పులుంటాయి. ప్రేమికులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వైవాహిక జీవతంలో కొన్ని ఇబ్బందులుంటాయి.
Also Read: అష్టైశ్వర్యాలను ప్రసాదించే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం!
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. పోటీ పరీక్షలు , ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. సంభాషణలో సమతుల్యత ఉండేలా చూసుకోండి. మేధోపరమైన పని ఆదాయ వనరుగా మారవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓ ఆస్తి నుంచి ఆదాయ వనరులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.