అక్టోబరు 24 రాశిఫలాలు - ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఆచరణలో పెడతారు
Dussehra Horoscope 24th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 24 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో సమస్యలు ఉంటాయి. అతిగా మార్పులు చేర్పులు ఆశించవద్దు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కొన్ని పనులు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అహంకార ప్రవర్తనకు దూరంగా ఉండాలి. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు మీ ఆధిపత్యం పెరుగుతుంది. వ్యాపారంలో వినూత్న ప్రయోగాలు చేయగలరు. విద్యార్థులు నూతన కోర్సులు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. పరిశోధనపై ఆసక్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీపై చాలా ప్రభావం చూపుతారు. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. బంధువులను కలుస్తారు. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.
మిథున రాశి
ఈ రోజు వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పని తీరును ప్రశంసిస్తారు. మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీరు నిలిచిపోయిన మొత్తాన్ని పొందవచ్చు. విద్యార్థులు సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు.
Also Read: బాణాసంచా పర్యావరణానికి నిజంగానే హానికరమా!
కర్కాటక రాశి
ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రేమ సంబంధాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందుతారు. చేపట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని అడుగు ముందుకు వేయండి.
సింహ రాశి
మీరు ఏదైనా ముఖ్యమైన విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. డబ్బును దుర్వినియోగం చేయడం మానుకోండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు అధికారి వర్గం పట్ల ప్రతికూల ఆలోచనలు కొనసాగుతాయి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
కన్యా రాశి
ఈ రోజు చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. జీతాల పెంపుదల గురించి అధికారులతో చర్చలు ఉంటాయి. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయిస్తారు. అవివాహితుల వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
తులా రాశి
మీ సమీపంలోని ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన ఉద్యోగంలో చేరేందుకు ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. సామాజిక సమస్యలపై మీ వాయిస్ వినిపిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయాలన్న ఆలోచనకు దూరంగా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల నుంచి ప్రయోజనం పొందుతారు. బంధువులను కలుస్తారు. స్త్రీలు ఇంటి పనులతో విసుగు చెందుతారు.
ధనస్సు రాశి
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు వ్యాయామం చేయండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పనికిరాని ఆలోచనలతో సమయాన్ని వృథా చేయకండి. పరుషమైన మాటలు మాట్లాడొద్దు. కొన్ని రహస్య విషయాలు బహిరంగంగా బయటకు రావచ్చు. ఏదో పని మీద బయటకు వెళ్తారు.
మకర రాశి
మీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. విలాసాలకు ఖర్చు ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
కుంభ రాశి
అదనపు పని కారణంగా, మీరు కుటుంబానికి సమయం ఇవ్వలేరు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత వ్యాపారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మంచి రోజు కానుంది. షాపింగ్‌కి వెళ్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది.
మీన రాశి
మీరు మీ పనిని క్రమపద్ధతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సమస్యలను పరిష్కరించగలరు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకేసారి అనేక పనులు చేయడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. స్థిరాస్తుల కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.