By: RAMA | Updated at : 21 Feb 2023 05:37 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
ఈ మంగళవారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మేష రాశివారి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు, ఇది లాభదాయకంగా ఉంటుంది. మీరు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. చాలా కాలంగా నిలిచిపోయిన ధనాన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా పొందవచ్చు. రోజు ఆనందంగా గడిచిపోతుంది. సామాజిక రంగంలో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు
ఫిబ్రవరి 21వ తేదీ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలున్నాయి.
ఈ రోజు మిథున రాశి వారికి జీవితంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీ దూరదృష్టి, తెలివితేటలతో మీరు మీ పనిలో విజయం సాధిస్తారు.
ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు మంచి జరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. సమాజ సేవలో ఉండేవార గౌరవ మర్యాదలు పొందుతారు.
సింహ రాశి వారికి వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబం, సమాజంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో అనవసర పోటీకి దిగొద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి.
ఈ రాశివారికి కళాకృతులపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆఫర్ వస్తుంది. వివాహం చేసుకునే వారికి ఈ సమయం శుభప్రదం. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
తులా రాశి వారు ఈ రోజు ప్రారంభంలో బిజీగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉండొచ్చు. ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి.
వృశ్చిక రాశి వారు వ్యాపారంలో రుణం తీసుకోవలసి రావచ్చు. అనుకూలమైన ఫలితాల కోసం క్రియాశీలత , సంకల్పం అవసరం. విశేష ప్రయోజనాల వల్ల మనసులో ఆనందం ఉంటుంది. ఈరోజు సంతానం వల్ల సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశివారికి ఈ రోజు శుభదినం. చాలాకాలం తర్వాత వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
మకరరాశి ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ బాధ్యతల నుంచి పారిపోవద్దు..ప్రత్యేక శ్రద్ధ వహించండి. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మీ పనిలో సృజనాత్మకత ఉంటుంది. కార్యాలయంలో గౌరవం పొందుతారు.
కుంభ రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదం. ఈ రోజున పనులు తక్కువ సమయంలో పూర్తవుతాయి. ఆస్తివివాదాలు ఏమైనా కొనసాగితే ఈరోజు పరిష్కారం దిశగా అడుగుపడే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పథకాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
మీన రాశివారు తమ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపార పనులనిమిత్తం చేసే ప్రయాణం లాభదాయకుండా ఉంటుంది. మీ పిల్లల నుంచి ఓదార్పు పొందుతారు.
Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!
మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది
Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల