News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూన్ 18 రాశిఫలాలు, ఈ రాశివారికి ఇంట్లో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది

Rasi Phalalu Today June 18th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Horoscope Today 18th June 2023: జూన్ 18 మీ రాశిఫలితాలు

మేష రాశి

మీ ఆరోగ్యం బాగుంటుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఈరోజు కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కళాకారులు తమ కళలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

వృషభ రాశి 

మీకు ఈ  రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు ఆనందంగా గడుపుతారు.స్నేహితుల నుంచి  బహుమతులు పొందుతారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. మెరుగైన సంపాదన ఉంటుంది. కార్యాలయంలో వివాదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు.

మిథున రాశి

ఈరోజు సంయమనం పాటించండి. స్నేహితునితో మనస్పర్థలు ఏర్పడవచ్చు.కొన్ని కారణాల వల్ల అపార్థం ఏర్పడవచ్చు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఇంటి వాతావరణంలో ఏదోతెలియని ఆందోళన ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరగవచ్చు. ఈ రోజు దైవ భక్తిలో నిమగ్నమై ఉంటారు. 

Also Read: పురాణాల్లో ఈ వీరులంతా 'నాన్నకు ప్రేమతో' బ్యాచ్!

కర్కాటక రాశి

ఈ రోజు ఆర్ధిక  లాభదాయకం ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.  ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఆర్ధిక, వ్యాపార లావాదేవీలు చేయగలుగుతారు. పిల్లలతో కలిసి షికారు వెళ్తారు. అవివాహితులకు వివాహ సూచన అందుబాటులో ఉంటుంది.  ఏకాంతం లో ఆనందాన్ని అనుభవిస్తారు. కార్యాలయంలో అధికారుల సహాయం అందుతుంది.

సింహ రాశి 

ఈరోజు పనుల్లో జాప్యం ఉంటుంది. మీ ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. జీవితం కాస్త క్లిష్టంగా కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. వ్యాపారులు చాలా లాభాలను పొందుతారు.  బంధువులతో లావాదేవీలు చేయకండి.ముఖ్యమైన నిర్ణయాలు మీరే  తీసుకోకండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలను పొందవచ్చు.

కన్యా  రాశి

ఈరోజు మానసికంగా అలసటను అనుభవిస్తారు. పిల్లల ఏదైనా పొరపాటు వల్ల ఒత్తిడికి గురవుతారు. కోర్టు కేసులో ఇరుక్కోవచ్చు. పై అధికారితో వివాదాలు కూడా రావచ్చు.  కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మతపరమైన పనుల్లో ఖర్చు చేస్తారు. స్నేహితుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో సమయం గడుపుతారు.

Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!

తులా రాశి 

ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మాటల్లో సంయమనం పాటించాలి లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది. వివాదాలు, విభేదాలు ఉండవచ్చు. మీ దూడుకు స్వభావాన్ని నియంత్రించండి. ఖర్చులను నియంత్రించండి. మీ ప్రత్యర్థులు మరింత చురుకుగా మారవచ్చు అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ఆర్థిక లాభం ఉండవచ్చు. ఆహారం సక్రమంగా లేకపోవడం శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రమాదకర పనులు చేయవద్దు. 

వృశ్చిక రాశి 

ఈ రోజు ఆనందం, వినోదంతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్త్రీలకు నూతన వస్త్రాలు, ఆభరణాలు లభిస్తాయి. కొత్త పనిని ఆనందిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని పనుల్లో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. గతంలో మీరు చేసిన తప్పులకు  పశ్చాత్తాపపడవచ్చు.

ధనుస్సు రాశి

ఈ రోజు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఆనందం, శాంతి,  వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో లాభాలు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. స్నేహితుల సహకారం పొందగలుగుతారు. మీరు పరీక్షలో విజయంసాధించి  కీర్తిని పొందుతారు.ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మాతృ పక్షం నుంచి శుభవార్తలు అందుతాయి. శత్రువులను, ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. సంయమనంతో మాట్లాడటం ప్రయోజనకరంగా ఉంటుంది.

మకర రాశి

ఈ రోజు మానసికంగా గందరగోళానికి గురవుతారు. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈరోజు ముఖ్యమైన పనుల్లో తొందరపడకండి.అదృష్టం మీకు సహకరించకపోవటంతో  చిరాకు వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల  ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల అసంతృప్తిని భరించాల్సి వస్తుంది. అనవసర  ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు ఉంటాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

కుంభ రాశి 

అశాంతిని అనుభవిస్తారు. పెట్టుబడికి మంచి సమయం. విలాస సాధనాలు కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. తండ్రి నుంచి ప్రయోజనం పొందుతారు. భూమి, ఇల్లు, వాహనం మొదలైన వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.  ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయి.

మీన రాశి 

అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సృజనాత్మకత , కళాత్మకత అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు వలసలు లేదా పర్యాటకానికి అనుకూలం.  నిరుద్యోగులకు ప్రయోజనం పొందబోతున్నారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. ఏదైనా చర్చలో మీ అభిప్రాయాన్ని అంగీకరించమని ఒత్తిడి చేయవద్దు.

Published at : 18 Jun 2023 05:05 AM (IST) Tags: daily horoscope Horoscope Today Aaj Ka Rashifal Check Astrological prediction Today Horoscope Astrological prediction for 2023 June 18

ఇవి కూడా చూడండి

December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

Importance of Tidhi in Astrology: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!

Importance of Tidhi  in Astrology: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!

Vaikunta Ekadasi December 2023: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

Vaikunta Ekadasi December 2023: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

Horoscope Today November 29, 2023: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు

Horoscope Today November 29, 2023: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!