అక్టోబరు 20 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం!
Dussehra Horoscope 20th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 20 రాశిఫలాలు
మేష రాశి
అప్పులను తిరిగి పొందే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార ప్రయాణం మీ సౌలభ్యం మేరకు ఉంటుంది. చేపట్టే పనుల్లో అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో పెరుగుదల సాధ్యమవుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందుతారు.
వృషభ రాశి
కుటుంబానికి సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి. కొత్త ఆర్థిక విధానం ప్లాన్ చేసుకుంటారు, కార్యాలయంలో ప్రస్తుతం వచ్చే మార్పులు భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాముల సహకారం వల్ల పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. పాత వ్యాధి తిరగబెట్టొచ్చు.
మిథున రాశి
ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. తెలివిగా వ్యవహరించండి. శత్రువులు చురుకుగా ఉంటారు. కుటుంబం గురించి ఆందోళన ఉంటుంది.
కర్కాటక రాశి
విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడొద్దు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి గొడవలకు దిగవద్దు. పనికిరాని విషయాలకు సమయం వృధా చేయవద్దు. వ్యాపారంలో లాభాలుంటాయి.
సింహ రాశి
నూతన ఆస్తి కొనుగోలు , అమ్మకంలో విజయం సాధిస్తారు. శాశ్వత ఆస్తుల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ శుభవార్త అందుకుంటారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. రిస్క్ తీసుకోకండి.
కన్యా రాశి
వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భూమి, భవన నిర్మాణ పనులు లాభిస్తాయి. విలాస వస్తువులపై ఖర్చు ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. భూమిపై పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
Also Read: ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!
తులా రాశి
వ్యాపార పనులపై చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. మీరు పార్టీలు మరియు పిక్నిక్‌లను ఆనందిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి
సామాజిక జీవితంలో అనుకూలత ఉంటుంది. పాత వ్యాధి తిరిగి రావచ్చు. విచారకరమైన వార్తలు అందుకునే అవకాశం ఉంది. వివాదాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. తెలియని వ్యక్తులను అతిగా నమ్మవద్దు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది.
ధనస్సు రాశి
మీరు అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. వ్యాపార ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. ధైర్యం పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. రిస్క్ తీసుకుంటారు.
మకర రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒకరి ప్రవర్తన వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటికి అతిథులు వస్తారు. శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. క్రయ, విక్రయాల వల్ల లాభం ఉంటుంది. ప్రయాణం చేయడంపై ఆసక్తి ఉంటుంది.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
కుంభ రాశి
కొత్త పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపార ప్రయోజనాలు నెరవేరుతాయి...ఆశించిన లాభం పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మీన రాశి
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. అపరిచితులను నమ్మవద్దు. లావాదేవీల విషయంలో తొందరపడకండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.