అన్వేషించండి

మే 1 రాశిఫలాలు, ఈ రాశులవారి హోదా - సంపద పెరుగుతాయి

Rasi Phalalu Today 1st May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మే 1 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజు తక్కువ శ్రమతో పని పూర్తవుతుంది. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. ఉపాధి లభిస్తుంది. స్నేహితులకు సహాయం చేయగలరు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఏదో విషయంలో ఆందోళన ఉంటుంది. కుటుంబంలో కలహాల వాతావరణం ఏర్పడవచ్చు. 

వృషభ రాశి

ఈ రాశివారు శత్రువుల విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. చెడు వార్తలు ఎక్కడి నుంచైనా రావచ్చు. రిస్క్ తీసుకునే ధైర్యం చేయగలరు. ఆదాయం బావుంటుంది. సోదరుల మద్దతు లభిస్తుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. సోమరితనం వీడండి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి

ఈ రాశివారు లావాదేవీల విషయంలో తొందరపడొద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన ఖర్చు ఉంటుంది. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. ఊహించని లాభం ఉండవచ్చు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసి మోసపోకండి. ఉద్యోగంలో హక్కులు పెరుగుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

Also Read: 'మే' నెలలో మొదటి వారం ఈ రాశులవారు నిర్లక్ష్యంగా ఉంటే సక్సెస్ దూరమైపోతుంది

కర్కాటక రాశి

అదృష్టం కలిసొస్తుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మాటలో కఠినత్వం తీసుకురావద్దు. ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అపరిచితుడిని గుడ్డిగా నమ్మవద్దు. సమయం వృధా అవుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. 

సింహ రాశి

ఈ రాశివారి ప్రత్యర్థులు ఓ అడుగు వెనక్కు తగ్గుతారు. ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి. లాభదాయకమైన అవకాశాలు చేతికి వస్తాయి. వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయి. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించగలరు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది.

కన్యా రాశి

విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడుల వల్ల భవిష్యత్ లో లాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. మాట విషయంలో సంయమనం పాటించాలి

తులా రాశి

ఈ రాశివారు తొందరగా అలసిపోతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. బంధువులను కలిసే అవకాశం లభిస్తుంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ పరిస్థితి బావుంటుంది. వృత్తిలో లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

వృశ్చిక రాశి

ఏ పనిలోనూ తొందరపడకండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీపై ప్రతికూలత ఎక్కువ ఉంటుంది. వాహనాలు, యంత్రాల వినియోగంలో నిర్లక్ష్యం వద్దు.  వివాదాలను ప్రోత్సహించవద్దు. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. లావాదేవీల విషయంలో  జాగ్రత్తగా ఉండండి. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ రాశులవారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది, ఇలా అనుకుంటే అలా అవుతాయ్ అన్నీ!

ధనుస్సు రాశి

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ధన నష్టం ఏ విధంగానైనా జరగవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. లాభపడే పరిస్థితి ఉంటుంది. ఇంటి బయట వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొన్ని పనుల్లో లాభం ఉంటుంది. ఆస్తి పెరుగుదల ఉంటుంది.

మకర రాశి

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనాత్మకంగా కొత్త పనిలో చేయి వేయండి.

కుంభ రాశి

లావాదేవీల విషయంలో తొందరపడకండి. సరదాగా విహారయాత్రకు వెళ్లవచ్చు. ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇది మీకు కలిసొచ్చే సమయం అవుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అనవసర రిస్క్ తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతుంది.

మీన రాశి

ఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. అనవసర ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసకోవద్దు. ఏదైనా విషయంలో ఆందోళన ఉండవచ్చు. ఖర్చులను నియంత్రించండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. పనుల్లో జాప్యం ఉండవచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget