అన్వేషించండి

Horoscope Today: ఈ రాశులవారు తమ తీరుతో ప్రత్యర్థులను కూడా ఫిదా చేసేస్తారు!

Dussehra Horoscope 18th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబరు 18 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు చాలా కష్టపడితేనే  విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది. మీ తీరుపై చెడు ప్రభావం పడకుండా జాగ్రత్తపడండి.  సరైన విచారణ లేకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. రహస్య శాస్త్రాల వైపు ఆకర్షితులవుతారు. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించడం మంచిది. 

వృషభ రాశి

మీరు ఈ రోజంతా బిజీగా ఉంటారు. ప్రభుత్వ నిబంధనలను విస్మరించవద్దు. కెరీర్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలు తప్పవు.   

మిథున రాశి

ఈ రోజు మిథున రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో అంకిత భావం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. ఇంట్లో పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇతరులపై ఆధారపడవద్దు.

Also Read: ధనత్రయోదశి రోజు బుధుడి రాశిపరివర్తనం - లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి అన్నీ శుభాలే!

కర్కాటక రాశి

ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మార్కెటింగ్ ఫీల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి క్లయింట్‌లను పొందవచ్చు. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రయాణం విజయవంతమవుతుంది. మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు.

సింహ రాశి

జీవిత భాగస్వామికి మీపై ఆగ్రహం పెరగవచ్చు. పనికిరాని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ సహోద్యోగుల మద్దతు మీకు లభించదు. స్టాక్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. కొన్ని పనుల్లో రిస్క్ తీసుకోవచ్చు. సంతానం విజయం సాధిస్తుంది.

కన్యా రాశి 

కార్యాలయంలో ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. బంధాల మధ్య సందేహాలకు అవకాశం ఇవ్వొద్దు. మేధోపరమైన విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయ పనిలో మీ వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దొద్దు. 

తులా రాశి 

ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అధికారులను కలిసే అవకాశాలున్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత బాధ్యత పొందుతారు. 

Also Read: తులా సంక్రాంతి - మీ రాశిపై సూర్య సంచారం ప్రభావం ఎలా ఉంటుందంటే!

వృశ్చిక రాశి 

ఈ రోజు జీవన విధానంలో మార్పు ఉంటుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు చదువుతో పాటు కొన్ని ఉద్యోగాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. దంపతులకు శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రత్యర్థులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ ప్రవర్తనలో సున్నితంగా ఉండండి. పాజిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. మీరు ఆర్థిక విషయాలలో విజయం పొందవచ్చు. వ్యాపార సంబంధిత పర్యటన ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించగలరు. మీ మాటలో సంయమనం పాటించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకర రాశి

ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈరోజు మెరుగుపడవచ్చు. సన్నిహితులను కలిసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా వ్యాపారం చేసేవారు లాభపడతారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. కార్యాలయంలో మీరు ప్రశంసలు అందుకుంటారు.  

కుంభ రాశి 

మీరు ఈ రోజు  ప్రయాణం చేయాల్సి వస్తుంది.  వ్యాయామం, యోగా, ధ్యానం చేయండి. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొంటారు. కుటుంబంపై ఆధిపత్యం చెలాయిస్తారు. సామాజిక జీవితంలో మీ హోదా పెరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘించవద్దు. 

మీన రాశి

నూతన వ్యాపారం, ఉద్యోగం చేసేవారు పారదర్శకతను పాటించండి. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నిత్యం మీరు వినియోగించే వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. 

Also Read: ఇంట్లో భారీగా మార్పులొద్దు.. ఈ 6 పెయింటింగ్స్ పెట్టండి చాలు ఆదాయం, ఆనందం, మనశ్సాంతి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget