అన్వేషించండి

Budh Gochar 2024: ధనత్రయోదశి రోజు బుధుడి రాశిపరివర్తనం - లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి అన్నీ శుభాలే!

Mercury Transit in Scorpio: తక్కువ సమయంలోనే రాశులు మారే గ్రహం అయిన బుధుడు..ధన త్రయోదశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు..ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి రాజయోగం ఏర్పడబోతోంది...

Mercury Transit in Scorpio on 29 October 2024

ప్రస్తుతం తులా రాశిలో ఉన్న బుధుడు అక్టోబరు 28 న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు
నవంబరు  22 వరకూ వృశ్చిక రాశిలో సంచరించి..తిరిగి అదే రాశిలో వక్రంలో సంచరిస్తాడు... 
డిసెంబరు 14 న వక్రం పూర్తిచేసుకుని తిరిగి సాధారణ సంచారం ఉంటుంది
జనవరి 05న వృశ్చిక రాశి నుంచి ధనస్సులోకి ప్రవేశిస్తుంది...

గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధుడు..మిగిలిన గ్రహాల కన్నా త్వరగా రాశి పరివర్తనం చెందుతాడు. అయితే ఈ సారి వృశ్చిక రాశిలో ఏకంగా దాదాపు రెండున్నర నెలలు సంచరించబోతున్నాడు. అక్టోబరు నెలాఖరున వృశ్చిక రాశిలో ప్రవేశించి...అదే రాశిలో వక్రంలో ప్రయాణించి.. తిరిగి ఆ రాశిలో సాధారణ స్థితిలో సంచరించి.. జనవరి లో రాశి పరివర్తనం చెందనున్నాడు.

బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే సమయంలో శుక్రుడు కూడా అదే రాశిలో ఉండడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ఈ శుభయోగం కొన్ని రాశులవారికి విశేష లాభాలను అందిస్తుంది. 

Also Read: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!

వృషభ రాశి
 
వృశ్చిక రాశిలో బుధుడి ప్రవేశం వృషభ రాశివారికి మంచి ఫలితాలను అందిస్తోంది. ఈ సమయంలో బంధాలలో ఉండే విభేదాలు తొలగిపోతాయి. నిజాయితీగా వ్యవహరిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో చేసే పనిపై స్వీయ అవగాహన అవసరం. సమస్యలను నివారించలేరు కానీ...వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడండి.. అనవసర మౌనం సమస్యలు పెంచుతుంది. మీ అంచనాల విషయంలో స్పష్టంగా వ్యవహరించండి. 

మిధున రాశి

లక్ష్మీనారాయణ రాజయోగం మిథున రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. అయితే సంపాదనతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి ముందుగా జాగ్రత్తపడాలి. ఉద్యోగం, వ్యాపారంలో కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

సింహ రాశి
 
బుధుడు-శుక్రుడు సంయోగం.. సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఈ సమయంలో ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. అయితే ఏవిషయాన్ని అయినా దాచిపెట్టి ఉంచొద్దు..నిజాయితీగా చెప్పండి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహరాల్లో లాభం ఉంటుంది.  

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తులా రాశి

వశ్చిక రాశిలో బుధుడి సంచారం తులా రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తీర్చేస్తుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి. కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చిక రాశి
 
మీ రాశిలోనే బుధుడు-శుక్రుడు సంచరిస్తున్నందున మీకు అన్నీ సంతోషకర ఫలితాలే ఉన్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఈ సమయంలో చేసే ప్రయాణాలు ఆహ్లాదరకరంగా ఉంటాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. మేధోపరమైన విషయాల్లో ఓ మెట్టు ఎదుగుతారు.

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
 
కుంభ రాశి

కుంభ రాశి వారు వార గౌరవం పెరుగుతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ పటిష్టంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో మీకు స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. తండ్రిదండ్రుల దీవెనలు మీపై ఉంటాయి. రచనా రంగానికి, కళా రంగానికి చెందినవారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget