Horoscope Today 17th December 2022: కార్యాలయంలో మీ ప్రతిష్టను దిగజార్చేవారున్నారు జాగ్రత్త, డిసెంబరు 17 రాశిఫలాలు
Horoscope Today 17th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 17th December 2022: కార్యాలయంలో మీ ప్రతిష్టను దిగజార్చేవారున్నారు జాగ్రత్త, డిసెంబరు 17 రాశిఫలాలు Horoscope Today 17th December 2022 Rasi Phalalu Astrological Prediction for Libra, Virgo, Leo and Other Zodiac Signs Horoscope Today 17th December 2022: కార్యాలయంలో మీ ప్రతిష్టను దిగజార్చేవారున్నారు జాగ్రత్త, డిసెంబరు 17 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/16/4e44578861a70fa216225fb2895afc871671197351845217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 17th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది.. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
వృషభ రాశి
మానసిక ఆందోళనలు మిమ్మల్ని ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టనివ్వవు. కానీ ప్రశాంతంగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు సరైన సమయం కాదు. ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు. సంతానం వల్ల అవమానం ఎదుర్కోవలసి రావొచ్చు.
మిథున రాశి
ఈ రాశివారు దుబారా ఖర్చులు తగ్గించాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు తప్పవు. కొత్తవ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఉద్యోగంలో ఆటంకాలుంటాయి. కుటుంబంలో వివాదాలు జరగవచ్చు. ప్రతికూల ఆలోచనల వల్ల మీకు మీరు ఇబ్బందిపడతారు. ఏదైనా పని విషయంలో ఆందోళన చెందుతారు.
(2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
కార్యాలయంలో మీ ప్రతిష్టను దిగజార్చడానికి లేదా మీ పనిని పాడుచేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని చెడుగా తామని మంచిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. జీవిత భాగస్వామి గురించి ఆందోళన ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. మీరు ఏం చేసినా విశ్వాసంతో చేయండి. కళా రంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు
సింహ రాశి
కుటుంబంలో ప్రతికూల వాతావరణం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. వాహనంపై ఖర్చు పెడతారు. కార్యాలయంలో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బంది ఉంటుంది. అయితే కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించిన ఆందోళన చెందుతారు. ఆద్యాత్మిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయంలోని సీనియర్ల సహకారంతో మీ పనులు పూర్తి చేస్తారు.
Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు
కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది.ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. సరైన ప్రణాళిక ప్రకారం మీ కెరీర్లో మార్పులు చేసుకోండి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో కొత్త సాంకేతికతపై వ్యయం పెరుగుతుంది. అనేక వ్యాపార అవకాశాలు మీ ముందుకు రావచ్చు, సరైన నిర్ణయం తీసుకోండి. చెవి సంబంధిత వ్యాధిలో బాధపడతారు. మీరు ఎవరినైనా త్వరగా నమ్ముతారు. అయితే మీ గురించి మీరు త్వరగా ఓపెన్ అవొద్దు.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం ద్వారా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా మంచి రోజు. కొత్త ఆదాయ వనరులు చూసుకుంటారు.ఆర్థికపరంగా మంచిరోజు. వ్యాపారులు అకస్మాత్తుగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి రోజు.
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఇంటికి కొత్త అతిథులు వచ్చే అవకాశం ఉంది, దీని కారణంగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమన్వయం ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో బాధపడతారు. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.
మకర రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రుణ సంబంధిత విషయాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు.
(2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
కుంభ రాశి
ఈరోజు కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి.మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ ఆచారాలను విస్మరించవద్దు, ఇది జీవితంలో ముఖ్యమైన భాగం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు మీ సహనాన్ని పరీక్షిస్తారు.
మీన రాశి
ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. స్నేహితులతో వాదన ఉండొచ్చు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. అధికారులతో వివాదం ఉండొచ్చు. కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడతారు.
(2023 కర్కాటక రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)