క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలు- ఆ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెపురుగు గూళ్లు కడతారు
క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరించుకోవడం, కేక్, బహుమతులు ఇవన్నీ కామన్..అయితే కొన్ని ప్రాంతాల్లో వింత వింత సంప్రదాయాలు పాటిస్తారు అవేంటంటే…
స్లోవాకియాలో క్రిస్మస్ రోజు....పెళ్లి కానివారు ఆ రోజు గుమ్మానికి అంటే ఇంటి ఎంట్రన్స్ కి వెనక్కు తిరిగి నిల్చుని చెప్పు తీసి విసురుతారు. ఆ చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడిందంటే త్వరలో పెళ్లవుతుందని నమ్ముతారు
పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ రోజు సాంప్రదాయంగా 'టర్కీ' పక్షిని తింటారు జపాన్లో చికెన్ అమ్మకాలు మామూలు రోజులకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి
అంతటా ప్లం కేక్ సాంప్రదాయంగా ఉంటే జపాన్‌లో స్పాంజ్ కేక్ ఎక్కువ.. అయితే క్రిస్మస్ రోజు అమ్మకం కాని కేకులను ఆ తర్వాత రోజు ఎవ్వరూ కొనుగోలు చేయరు, ఇంట్లో ఉండిపోయినవి కూడా తినరు... పారేయాల్సిందే...
ఫిన్లాండ్‌లో క్రిస్మస్ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు
ఆ రోజు వంట చేసి అవన్నీ బల్లపై పెట్టేసి..మంచాలు సిద్ధం చేసి ఇంట్లో వాళ్లంతా నేలపై పడుకుంటారు. గతించిన వారు వచ్చి తినేసి పడుకునేందుకు వీలుగా అలా చేస్తారట
స్వీడన్లో పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్ ఈవ్ అర్ధరాత్రి ఆ మేకను కాల్చేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది.
మామూలుగా అయితే క్రిస్మస్ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. దీని వెనుక స్థానికులు ఓ కథ చెబుతారు...
ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్ చెట్టుని అలంకరించే స్థోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలెపోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగించాయట. అందుకే సాలెగూళ్లను వేలాడదీస్తారు
ఇంకా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి.. Images Credit: Freepik