News
News
X

Horoscope Today 14th December 2022: మీలో మంచి కాకుండా చెడును చూసేవారికి దూరంగా ఉండండి, డిసెంబరు 14 రాశిఫలాలు

Horoscope Today 14th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 14th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
మీ మనసును స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం వల్ల ఈ రోజు అన్నింటా సక్సెస్ అవుతారు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు మంచి రోజు.అనుకున్న ప్రకారం పనులు పూర్తిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. 

వృషభ రాశి 
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆఫీసు పనులు రోజువారీ కంటే మెరుగ్గా చేస్తారు. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు.  ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

మిధున రాశి 
ఈ రోజు మీరు చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు నాయకత్వ పాత్రలో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో మీరు విజయం సాధిస్తారు. ఇంటి వద్ద ఒక ఈవెంట్ లేదా పండుగను నిర్వహించడంలో మీరు పాల్గొంటారు.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కర్కాటక రాశి
మీ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీలో మంచిని కాకుండా చెడుని మాత్రమే చూసేవారికి దూరంగా ఉండండి. నిరుద్యోగులకు శుభసమయం.ఎరుపు రంగు ఈ రోజు మీకు కలిసొస్తుంది. సమస్యలకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది ఆలోచించండి 

సింహరాశి 
ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. తోబుట్టువుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. క్రమరహిత దినచర్య కారణంగా కాస్త బద్దకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

కన్యా రాశి 
ఈ రోజు మీరు ఒక కొత్త పనిని నేర్చుకునే అవకాశం పొందుతారు. భవిష్యత్తులో దీని  ప్రయోజనాన్ని తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయండి. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభసమయం. అదృష్టం కలిసొస్తుంది

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

తులా రాశి 
రు మీ జ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేస్తూనే ఉంటారు. వ్యాపార భాగస్వాములు, మిత్రుల పట్ల పూర్తి గౌరవం కలిగి ఉంటారు. మీ ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది గమనించండి. ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

ధనుస్సు రాశి 
ఈ రోజు వ్యాపారంలో రిస్క్ తీసుకోపోవడం మంచిది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. చెల్లంచాల్సిన మొత్తం క్లియర్ చేసుకోవడం మంచిది. ప్రత్యర్థులు, పోటీదారులు మీకు హాని చేయలేరు. ఆరోగ్యం బావుంటుంది. మానసికంగా కొంత డల్ గా ఉంటారు.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మకర రాశి
మీపై మీకున్న నమ్మకాన్ని కొనసాగించండి. గ్రహాలు మీకు అననకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.జ్ఞానానికి సంబంధించిన రంగంలో బాగా రాణిస్తారు. 

కుంభ రాశి 
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన వార్తలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు సామాజిక రంగంలో ప్రశంసలు పొందుతారు. స్నేహితుడి నుంచి మద్దతు పొందుతారు.

మీన రాశి 
ఈ రోజు మీరు ఆప్యాయతతో కూడిన ప్రేమను పొందుతారు. కొత్త వ్యాపార సంబంధాలు ఖరారు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి.

Also Read: సింహ రాశివారికి 2023లో ఆ మూడు నెలలు మినహా ఏడాదంతా అద్భుతమే!

Published at : 14 Dec 2022 05:24 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today cancer Horoscope today libra Horoscope today Horoscope Today 14th December 2022

సంబంధిత కథనాలు

Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!

Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!

Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!

Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!

Love Horoscope Today 04th February 2023: ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు

Love Horoscope Today 04th February 2023: ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు

Horoscope Today 04th February 2023:ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

Horoscope Today 04th February 2023:ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!