News
News
వీడియోలు ఆటలు
X

మే 13 రాశిఫలాలు, ఈ రాశివారు కాస్త ఓపికగా వ్యవహరిస్తేనే సమస్యల నుంచి బయటపడతారు

Rasi Phalalu Today 13th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మే 13 రాశిఫలాలు

మేష రాశి
ఈరోజు మేష రాశివారికి మంచి ఫలితాలున్నాయి. వ్యాపారులకు అనుకూలమైన రోజు..మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం ప్రయోజనకరంగా ఉంటుంది. భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు మంచి రోజు అవుతుంది. కెరీర్లో కొత్త మార్పులుంటాయి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది.

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆస్తి సంబంధిత వ్యవహారాలు పూర్తిచేస్తారు. ఆర్థికలాభాలుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. ఈ రాశి వివాహితుల జీవితం బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తమ పనితీరుకి ఉన్నతాధికారులనుంచి  ప్రశంసలు అందుకుంటారు. మీ సహోద్యోగులు మీ నుంచి సహాయం తీసుకోవచ్చు.

మిథున రాశి
ఈ రోజు  మీ పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు కూడా పూర్తిచేస్తారు.  విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. ప్రత్యర్థులు ఈరోజు మీకు దూరంగా ఉంటారు. బంధువులను కలుస్తారు. 

Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!

కర్కాటక రాశి
ఈ రాశివారు రోజంతా ఆనందంగా ఉంటారు. గతంలో ఎప్పుడో మొదలెట్టిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. కాస్త ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. మీ శ్రమ మీకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. జీవిత భాగస్వామి నుంచి సహాయం అందుతుంది. తెలియని వ్యక్తులతో ఏ విషయాలు షేర్ చేసుకోవద్దు.

సింహ రాశి
ఈ రోజు కుటుంబ సమస్యలతో గందరగోళం చెందుతారు. మీరు మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచితేనే కచ్చితంగా విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. పెట్టుబడి పెట్టే ముందు దానిగురించి చర్చించిన తర్వాతే డబ్బు పెట్టండి. అనవసరమైన షాపింగ్‌ను నివారించండి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోండి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

కన్యా రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు లాభపడతారు, ఉద్యోగులకు మంచి రోజు. ఆరోగ్యం బావుంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. ఆర్థికలాభాలుంటాయి. సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మీకు మంచిరోజు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.

తులా రాశి
ఈ రాశివారికి ఈ రోజు అనుకూలమైన రోజు. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. గందరగోళ పరిస్థితి తెరపడుతుంది. ఈ రోజు మీరు కొన్ని పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. వివాహితులు టూర్ ప్లాన్ చేసుకుంటారు. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు బావుంటుంది.

Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!

వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త తెలివిగా వ్యవహరిస్తే కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉండేవారు లాభపడతారు. అభివృద్ధికి అవకాశం ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. మీతెలివితేటల్ని ఉపయోగించుకుని వేరొకరు ఎదుగుతారు. మొండివైఖరి వదులుకుంటే మీకే మంచిది. 

ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి ఈ రోజు మంచిరోజు అవుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అవసరమైన అన్ని పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. సోమరితనం అనిపించవచ్చు. మీ కష్టానికి విజయం త్వరలోనే లభిస్తుంది.మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. దూరపు బంధువులను కలుస్తారు.

మకర రాశి
వ్యాపారంలో అభివృద్ధికి ఈరోజు అనుకూలం. కొన్ని సమస్యలకు ఈ రోజు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ పనిని మీరు నమ్మండి. పాత ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి.

కుంభ రాశి
ఈ రోజు మీ ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఓ సామాజిక కార్యక్రమానికి హాజరవుతారు. స్నేహితులేను కలుస్తారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించండి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉంటుంది. అనుకోని ఆర్థిక ప్రయోజనాలుంటాయి. 

మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ఓ ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.పనికిరాని పనులకు దూరంగా ఉండాలి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అవసరమైన వారికి సహాయం చేస్తారు. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది.

Published at : 13 May 2023 05:33 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 13th May 13th May Astrology

సంబంధిత కథనాలు

Mehandipur Balaji Temple: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!

Mehandipur Balaji Temple: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!

Saptamatrika: స‌ప్త‌ మాతృక‌లంటే ఎవరు - వాళ్లేం చేస్తారు!

Saptamatrika: స‌ప్త‌ మాతృక‌లంటే ఎవరు - వాళ్లేం చేస్తారు!

Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!

Samudrik Shastra about Teeth :  మీ దంతాల ఆకృతి  మీ భవిష్యత్ చెప్పేస్తుంది!

Ashwini Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!

Ashwini Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!

జూన్ 8 రాశిఫలాలు: హోదా, గౌరవం తగ్గించే పనులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి

జూన్ 8 రాశిఫలాలు:  హోదా, గౌరవం తగ్గించే పనులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం