అక్టోబరు 13 రాశిఫలాలు: ఈ రాశులవారికి ఈ రోజు అత్యంత ఫలవంతంగా ఉంటుంది - అన్నీ శుభాలే!
Dussehra Horoscope 13th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 13th October 2024
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు అత్యంత ఫలవంతంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులకు కుటుంబ సమస్య నుంచి సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చాలాకాలం తర్వాత పాతస్నేహితుడిని కలవడంసంతోషాన్నిస్తుంది. మీ ప్రత్యర్థులు అప్రమత్తంగా ఉంటారు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో పెద్ద ఆర్డర్‌ను స్వీకరించే అవకాశం ఉంది మీ సంస్థ మీపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటారు. జీవిత భాగస్వామి మాటలకు పూర్తి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా అవసరం. పిల్లలకు సమయం కేటాయించాలి.
మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలపై నియంత్రణ పాటించడం చాలా అవసరం.భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన పనులు పూర్తవుతాయి.
Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయ. మీ కీర్తి మరియు గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీరు ఇతరులకు నిజంగా మంచిని కోరుకుంటున్నప్పటికీ..అది ఎదుటివారికి స్వార్థంగా అర్థమవుతుంది. మీ సహోద్యోగుల మాటలు మిమ్మల్ని కలవరపెడతాయి. వ్యాపారంలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త.
సింహ రాశి
సింహరాశి వ్యక్తులకు ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు కొన్ని శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్‌లో ఉన్న పని పూర్తి అవుతుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టడం అవసరం.
కన్యా రాశి
కన్యా రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర మాటలు నియంత్రించాలి. గత ఆర్థిక లావాదేవీలు మీకు తలనొప్పిగా మారవచ్చు. ప్రయాణాలలో కీలక సమచారాన్ని అందుకుంటారు. మీ పనిలో మీ సహోద్యోగులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. వి
తులా రాశి
తులా రాశి వారు ఈ రోజు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులు వృత్తిపరమైన ప్రదేశంలో మీ పనికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన విహారయాత్రకు వెళ్లవచ్చు.. విలువైన వస్తువులపై చాలా శ్రద్ధ వహించండి. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి..మాటతూలకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు తప్పనిసరిగా నెరవేరుస్తానని ఇచ్చిన మాటను ఆచరణలో చూపించండి. ఉద్యోగులు, వ్యాపారులు బిజీగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారు పురోగతి చెందుతారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు హెచ్చుతగ్గులుంటాయి. నూతన వెంచర్ ప్రారంభించాలి అనుకున్నవారు ఇంకొంత కాలం ఆగిచూడడం మంచిది. భాగస్వామ్యంలో ఏవైనా ఒప్పందాలను ఖరారు చేయడం కూడా ఇప్పుడు వద్దు. నూతన సబ్జెక్టులు తీసుకున్న విద్యార్థులకు కొన్నాళ్లు ఒత్తిడి తప్పదు. అవివాహితులకు వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.
Also Read: రామాయణం, మహాభారతం, భాగవతం ఈ ఒక్క శ్లోకంలో చదివేసుకోండి
మకర రాశి
మకర రాశి వారు ఈరోజు వాహనాలను వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన అంశం మీకు కొంత తలనొప్పిని కలిగించవచ్చు. మీ సహోద్యోగులు కూడా మీ పనులను పూర్తి చేయడంలో అడ్డంకులు సృష్టించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. మీరు కుటుంబ సభ్యుల కెరీర్‌కు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ముందుకు సాగడం ముఖ్యం.
కుంభ రాశి
కుంభరాశి వ్యక్తులకు గడిచిన రోజులకన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అప్పులు చేయవద్దు. నూతన ఉద్యోగంలో చేరేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
మీన రాశి
మీనరాశి వారికి ఈ రోజు సవాలుతో కూడిన రోజు అవుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.వ్యాపారంలో ఉండేవారు అజాగ్రత్త కారణంగా పెద్ద ఆర్డర్ కోల్పోయే ప్రమాదం ఉంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.