News
News
X

Horoscope Today 10th September 2022: ఈ రాశులవారికి పని ఒత్తిడి, ఆ రాశివారికి ఉత్సాహం - సెప్టెంబరు 10 రాశిఫలాలు

Horoscope 10th September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope 10th September 2022: ఈరోజు సింహం,  కన్యారాశితో సహా ఈ రాశుల వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కన్యా రాశి వారు ఇంటికోసం పెట్టే ఖర్చులు పెరుగుతాయి. ధనస్సు రాశివారు తమ పనులన్నీ ఉత్సాహంగా చేసేసుకుంటారు. సెప్టెంబరు 10 శనివారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి
మేషరాశి ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మనసులో అశాంతి ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.

వృషభ రాశి
ఈ రాశివారికి పనిభారం పెరుగుతుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. రిలాక్స్ అయ్యేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. వ్యాపారం సాధారణంగా సాగుతుంది.కొత్త ప్రయోగాలు చేయవద్దు. 

Also Read: ఈ రాశులవారు వివాహ బంధంలో ఇమడలేరు!

మిథున రాశి
 ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు మీపై మరింత ఒత్తిడి పెంచుతాయి. ఆహారంపై శ్రద్ధ వహించండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పనిభారం పెరుగుతుంది. 

కర్కాటక రాశి 
ఈ రోజు కర్కాటక రాశివారు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు.

సింహ రాశి
సింహ రాశి వారు పెరిగిన ఖర్చులు తగ్గించే దిశగా ఆలోచన చేయండి. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు.

Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!

కన్యా రాశి
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా పనికి అధికంగా ఖర్చుచేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఖర్చులు తగ్గించకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. మీకు ఇబ్బంది కలిగించే విషయాలకు దూరంగా ఉంచాలి. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి
 ఈ రోజు తులారాశి వారిపై పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. పిల్లల నుంచి విన్న కొన్ని వార్తలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగులు తమ టార్గెట్లు రీచ్ అవుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. 

ధనుస్సు రాశి
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. ఆర్థిక లాభం పొందాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు సాగండి. 

మకర రాశి
ఈ రాశివారు తల్లిదండ్రులతో సరదాగా గడుపుతారు. రోజంతా ఓపికగా వ్యవహరిస్తారు. కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స కోసం ఖర్చులు పెరుగుతాయి. మీకు మీ పిల్లల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. 

కుంభ రాశి
ఈ రాశివారికి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకే పొదుపు చేయడం చాలా ముఖ్యం. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబం కోసం సమయం వెచ్చించండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

మీన రాశి
ఈ రోజు మీ సానుకూల ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఆకట్టుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో వేరేవారి ఇన్వాల్వ్ మెంట్ కారణంగా గొడవలు జరుగుతాయి. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. 

Published at : 10 Sep 2022 06:09 AM (IST) Tags: Weekly Horoscope september 2022 horoscope 9th september 2022 horoscope today's horoscope 10th september 2022

సంబంధిత కథనాలు

Numerology Today:  ఈ తేదీల్లో పుట్టినవారికి ఆదివారం ప్రత్యేకం, అక్టోబరు 2 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారికి ఆదివారం ప్రత్యేకం, అక్టోబరు 2 న్యూమరాలజీ

Horoscope Today 2nd October 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది- వీరిపై సరస్వతీ కటాక్షం ఉంటుంది, అక్టోబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd October 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది- వీరిపై సరస్వతీ కటాక్షం ఉంటుంది, అక్టోబరు 2 రాశిఫలాలు

Navratri 2022: అజ్ఞానాన్ని తొలగించే ఆరో దుర్గ కాత్యాయని, నవరాత్రుల్లో ఆరవ రోజు కాత్యాయనీ అలంకారం

Navratri 2022:  అజ్ఞానాన్ని తొలగించే ఆరో దుర్గ  కాత్యాయని, నవరాత్రుల్లో ఆరవ రోజు కాత్యాయనీ అలంకారం

October 2022 Horoscopes: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

October 2022 Horoscopes:  విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

October 2022 Horoscopes: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!

October 2022 Horoscopes: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?