అన్వేషించండి

Ghaati Trailer: అనుష్క యాక్షన్ విశ్వరూపం... సీతమ్మోరు లంకా దహనం చేసినట్టే - 'ఘాటి' ట్రైలర్ చూశారా?

Ghaati Trailer Review: 'ఘాటి' గ్లింప్స్‌ చూసినప్పుడు ఓ వ్యక్తి పీకను అనుష్క కోయడం చూసి ఆశ్చర్యపోయారంతా. అందుకు పదింతలు అన్నట్టు ట్రైలర్‌లో యాక్షన్ విశ్వరూపం చూపించారు.

'బాహుబలి'లో అనుష్క శెట్టి యుద్ధం చేశారు. బాణాలు వేశారు. ఆవిడ యాక్షన్ చేయడం కొత్త కాదు. అయితే... 'ఘాటి' గ్లింప్స్‌ మాత్రం ఆవిడను కొత్త కోణంలో చూపించింది. ఓ బస్సులో మనిషి పీక కోయడం చూసి ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఇవాళ విడుదల చేసిన 'ఘాటి' ట్రైలర్ అందుకు పదింతలు అన్నట్టుంది. అనుష్క యాక్షన్ విశ్వరూపం చూపించారు. 

పెళ్లి ఎప్పుడు? వెయిటింగ్ ఇక్కడ?
గంజాయి నేపథ్యంలో 'ఘాటి' తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. 'ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్! బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలుకొట్టి రక్తంతో రోడ్లు వేసినోళ్లు! ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదలు. వీళ్ళు కదిలే కొండలు సార్' వాయిస్ ఓవర్ వినిపిస్తుంటే... హీరో హీరోయిన్లు విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి సహా వాళ్ళ నేపథ్యాన్ని పరిచయం చేశారు. అనుష్కను బస్ కండక్టర్ అన్నట్టు చూపించారు. అదే సమయంలో ఆవిడ గంజాయి స్మగ్లింగ్ చేసినట్టూ స్పష్టం చేశారు. 

'మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకోండిరా. ఎవరి పెళ్లి అయినా మీ పెళ్లిలా ఫీల్ అవుతుంది' అని విక్రమ్ ప్రభుతో రాజా చెప్పే డైలాగ్ బావుంది. అయితే అనుష్క శెట్టిని 'పెళ్లి ఎప్పుడు డార్లింగ్?' అని రాజు సుందరం అడగటం... 'వెయిటింగ్ ఇక్కడ' అని సమాధానం ఇవ్వడాన్ని ఆమె వ్యక్తిగత జీవిటంతో కొందరు ముడి పెడుతున్నారు. అప్పటి వరకు ఓ సాధారణ కథగా ఉన్న 'ఘాటి' విలన్ ఎంట్రీతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా మారింది. చైతన్య రావు, రవీంద్ర విజయ్ క్యారెక్టర్లు - వాళ్ళ నటన కథ స్వరూపాన్ని మార్చేసింది. 'ఘాటీలకు పెంచడం, దాటించడం తెలిస్తే చాలు! బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు' అంటూ డైలాగ్ డెలివరీలోనూ, నటనలోనూ చైతన్య రావు చూపించిన విలనిజం బావుంది.

Also Read: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?

'ఘాటి' ట్రైలర్ మొత్తంలో హైలైట్ అంటే అనుష్క శెట్టి యాక్షన్ విశ్వరూపం. ఇక చివరలో 'సీతమ్మోరు లంకా దహనం చేసినట్టే' అంటూ ఆ 'హై'ను పీక్స్ కు తీసుకు వెళ్లారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నుంచి ఇటువంటి యాక్షన్ ఫిల్మ్ రావడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.

సెప్టెంబర్ 5న సినిమా విడుదల!
అనుష్కా శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా నటించిన 'ఘాటి' సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Also Readఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Mahesh Babu : మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
Embed widget