అన్వేషించండి

సెప్టెంబర్ 01 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారి జీవితాల్లో ప్రతికూలత ఉంటుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 September 01

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి చాలా ప్రతికూలంగా ఉండబోతోంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు వృధా అవుతాయి. కొత్త ఉద్యోగాల్లోకి మారాలనే ఆలోచనని విరమించుకోవటం మంచిది. ప్రత్యర్థులతో అప్రమత్తంగా ఉండండి. ఇతరుల పనుల్లో వేలు పెట్టకండి. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. వ్యాపారులు పెద్ద పెద్ద ప్రయోగాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 

వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు గౌరవం పొందుతారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పాల్గొనే విద్యార్థులు సక్సెస్ అవుతారు. ఉన్నతవిద్యా అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం..వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి  ప్రశంసలు,  బహుమతిలు పొందవచ్చు. మీరు చేపట్టిన పనులన్నీ ఆలస్యమైనా పూర్తవుతాయి. ప్రేమికులకు వివాహానికి అనుకూలమైన ప్రతిపాదనలు పొందుతారు.

మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రణాళికలను, కార్యాచరణని రహస్యంగా   ఉంచండి. విద్యార్థులు కొత్త విషయాల అధ్యయనంపై ఆసక్తి చూపుతారు. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఉద్యోగస్తులు బాధ్యతాయుతమైన పదవిని పొందే అవకాశం ఉంది. 

Also Read: లోకంలో మనుషులంతా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోరూ!

కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం కారణంగా ఆఫీస్ లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. దాని వలన సంతోషంగా ఉంటారు. మీరు కొన్ని శుభ వార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించండి. వారి అభిప్రాయాలని గౌరవించండి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార పర్యటనలకు ఈ రోజు చాలా మంచిది. 

సింహ రాశి 
ఈ రాశి వారు పనిపై పూర్తి శ్రద్ధ వహించండి. నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన సమయం. మీ తప్పులను సరిదిద్దుకునేందుకు ఇదే మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలు  జరిగే అవకాశముంది. కొన్ని కారణాల వల్ల మీరు పిల్లలపై కోపగించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా  ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్యా రాశి
ఈ రాశికి చెందిన ఉన్నత అధికారులు ఉద్యోగంలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు.

తులా రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ పురుషులు పిల్లల కెరీర్ , భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. శత్రువులు  యాక్టివ్ గా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను అపరిచిత వ్యక్తులతో  షేర్ చేసుకోకండి. 

Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం

వృశ్చిక రాశి
ఈ రాశివారి ఇంట్లో వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. ఎప్పుడో  పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. మీకున్న సామాజిక సంబంధాలు మరికొంచెం బలపడతాయి. విద్యార్థులు తమ వృత్తిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేనందున సంయమనం పాటించడ మంచిది. అనుకోని  కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి కారణంగా మీరు ఆందోళన చెందుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. కొపాన్ని అదుపులో ఉంచుకుని   శాంతియుతంగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన అనుచితంగా ఉండేలా చూసుకోండి. మీరు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి.  అనవసర ఆలోచనలతో సమయం వృధా చేసుకోవద్దు 

మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. సామాజిక సేవలో మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు.  మీ ఆలోచనలకు, అభిప్రాయాలకి ప్రాముఖ్యత పెరుగుతుంది.

కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేనందున కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ రోజు వారి పనులు ఆటంకాలు ఏర్పడి చికాకులతో పూర్తవుతాయి. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. కొంతమంది మీకు హాని చేయాలనుకుంటున్నారు. మీ గౌరవానికి భంగం కలగొచ్చు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

మీన రాశి
ఈ రాశి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలవైపు మీ దృష్టి మరలుతుంది. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా  ఉత్సాహంగా ఉంటారు...కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రమోషన్, బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
Hindu Gods: హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై  ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget