Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు
Rasi Phalalu Today 08th February 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 08th February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం
మేష రాశి
ఈ రోజు మీరు శుభకార్యానికి హాజరవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది. ధన సంబంధ విషయాల్లో తొందరపడొద్దు. భారీ లాభాలు ఆశించవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృషభ రాశి
ఈ రోజు వ్యక్తిగత సంబంధాల్లో బలం చేకూరుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచిరోజు. పనిపై శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసేవారు ఈ రోజు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి అవకాశం. మీరు అప్పగించే బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేవారుంటారు
మిథున రాశి
ఈ రోజు మాటతీరు, ప్రవర్తనలో సున్నితత్వాన్ని పాటించండి. మీరు పనిచేసే ప్రదేశంలో వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. ఆలోచించి ప్రణాళికలు వేసుకోవడం మంచిది. లేదంటే సమస్యలు పెరుగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులుంటే ఈ రోజు పూర్తవుతాయి.
Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజు. మీ వృత్తిలో తీవ్రమైన వ్యతిరేకత ఉండవచ్చు కానీ మీరు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కలిసొచ్చే రోజు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు మీరు సోదరుల నుంచి సహాయం పొందుతారు
సింహ రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలుంటాయి. పరిపాలనా విభాగంలో ఉండేవారికి కలిసొస్తుంది. పని కార్యకలాపాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సోమరితనాన్ని తరిమికొట్టాలి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పొందొచ్చు.
కన్యా రాశి
ఈ రోజు మీకు మంచిరోజు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. పనిప్రదేశంలో లాభాలు పొందుతారు.
తులా రాశి
ఈ రోజు తులారాశివారికి బాగానే ఉంది. మీ గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల్లో ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు...దీనివల్ల మీకు సమస్యలు రావొచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారు ముఖ్యమైన చర్చలో పాల్గొంటారు. మీ రోజు ఒకరి రాకతో బిజీగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది . ఎక్కువ వనరుల నుంచి లాభపడతారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. పెద్ద పెట్టుబడులు పెడతారు. చాలా కాలం తర్వాత ఈ రోజు ఒక పాత స్నేహితుడిని కలుస్తారు.
Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
ధనుస్సు రాశి
ఈ రోజు వ్యాపార పరంగా మీకు మంచి రోజు అవుతుంది..మీరు ఒకర్ని గుడ్డిగా నమ్మితే వారు మీకు హానిచేస్తారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చేసేపనులవల్ల ప్రయోజనం పొందుతారు. కెరీర్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని వదిలించుకుంటారు.
మకర రాశి
ఈ రోజు మీరు జాగ్రత్తలు తీసుకోవలసిన రోజు . పని ప్రదేశంలో మీ శత్రువులు కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీ తెలివితేటల్ని ఉపయోగించుకుని బయటపడతారు.ఓ ముఖ్యమైన సమచారం వినే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచిఫలితాలు సాధిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో మీ సౌలభ్యం పెరుగుతుంది. మీవి ఈ రోజు కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి. పనిచేసే ప్రదేశంలో అహంకార పూరిత పనులు చేయొద్దు..లేదంటే ఒంటరి అయిపోతారు. తొందరపడి తీసుకునే నిర్ణయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
మీన రాశి
ఈ రోజు పురోభివృద్ధి సాధిస్తారు ..అందర్నీ కలుపుకుని పోయే పనిలో నిమగ్నమై ఉంటారు. ఏదైనా చట్టపరమైన విషయం ఈ రోజు మీకు సమస్యగా మారొచ్చు. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో ఏదైనా వివాదం ఉంటే అది కూడా ఈ రోజు సమసిపోతుంది. మీరు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు.