Horoscope Today January 02, 2024 : ఈ రాశివారు ఒక్కసారిగా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు, జనవరి 02 రాశిఫలాలు
Happy New Year 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Horoscope Today 02nd January 2024 - జనవరి 02 రాశిఫలాలు
మేష రాశి (Aries Horoscope Today)
జీవితంలో మీ లక్ష్యాలను సాధించేందుకు ఇదే మంచి సమయం. మీరు సమర్థవంతంగా ఎదిగేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రియమైనవారు మీపై చాలా శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులకు పనిలో అంకితభావం అవసరం. నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించండి.
వృషభ రాశి (Taurus Horoscope Today)
రోజంతా చాలా బిజీగా ఉంటారు. వ్యాపారంలో ఉన్నవారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం . లోతైన ఆలోచనల తర్వాత మీరు మీ ప్రణాళికలను అమలుచేయండి. కష్టపడి పనిచేస్తేనే తగిన ఫలితం పొందుతారు. శృంగార సంబంధంలో ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులకు శుభసమయం.
మిథున రాశి (Gemini Horoscope Today)
మీరు కొత్త కెరీర్ మార్గాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందవచ్చు. నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం ఇతరులతో పోటీ పడవలసి రావచ్చు. సహోద్యోగులతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచిసమయం. తోబుట్టువులు, పొరుగువారితో మీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఈ నెల అనువైనది. పొత్తి కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
మీ పనితీరులో మార్పులు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. పరధ్యానం నుంచి బయటకు రావాలి, బద్దకాన్ని వీడాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఒంటరిగా మీతో మీరు కాకుండా అందరితో కలిసేందుకు ప్రయత్నించాలి. చెడుప్రవర్తన ఉండేవారికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహ రాశి (Leo Horoscope Today)
మీరు త్వరలో పూర్తి చేయాలనుకుంటున్న పని కారణంగా మీరు మీ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వ్యక్తిగత , వృత్తి జీవితంలో అద్భుతమైన ఎదుగుదల కోసం వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి. మీ భాగస్వామికి సమయం ఇవ్వండి. కోపం తగ్గించుకోవాల్సిందే. క్రీడల వల్ల మనశ్సాంతి పొందుతారు.
కన్యా రాశి (Virgo Horoscope Today)
మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. ఉన్నతాధికారులతో, అధికారులతో వ్యవహరించేటప్పుడు విశ్వసనీయంగా మెలగాలి. ఎలాంటి వాదనకు దిగకుండా ఉండండి. మీ ప్రియమైనవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అర్థవంతమైన సంభాషణలో పాల్గొనండి.
తులా రాశి (Libra Horoscope Today)
ఈ రాశి ఉద్యోగులకు ఆహ్లాదకరమైన సమయం. అయినప్పటికీ మీ బాధ్యతలు మీకు భారంగా ఉన్నాయని భావిస్తే ఉన్నతాధికారులతో మాట్లాడటం చాలా ముఖ్యం. బంధువుల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా కుటుంబ వివాదాలలో చిక్కుకోవచ్చు. ప్రశాంతంగా ఉండి మీ ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
గడిచిన రోజుల కన్నా ఈ రోజు బావుంటుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు పనిలో ప్రశంసలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వినోదం కోసం సమయం కేటాయిస్తారు. మీ ప్రేమ భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
మీ పనిలో వైవిధ్యాన్ని కొనసాగించండి. చాలాకాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. చిన్న చిన్న అడ్జెస్ట్ మెంట్ కూడా మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాపారంల నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది.
మకర రాశి (Capricorn Horoscope Today)
మీరు భవిష్యత్ కోసం పొదుపు చేయాల్సిన సమయం ఇది. మీరు ఇష్టపడే వారికోసం సమయం వెచ్చించాలి. మీ బంధం మధ్య మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దు. కోపంలో నిర్ణయం తీసుకుంటే చాలా నష్టపోతారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. మంచి అవకాశాల కోసం వేచి ఉండండి.
Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!
కుంభ రాశి (Aquarius Horoscope Today)
మీరు జీవితంలో అన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది
మీన రాశి (Pisces Horoscope Today)
మీ సృజనాత్మక ఆలోచనలు సరిగ్గా అమలు చేస్తే సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయాన్ని మెరుగుపర్చుకునేందుకు నూతన మార్గాలను ఎంపిక చేసుకుంటారు. ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు కొనసాగుతున్నట్టైతే అవి పరిష్కారం అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు తప్పవు. అయితే మీ బంధాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మంచి ఫలితం పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.