Horoscope Toda 22 December 2021: ఈ రోజు ఈ రాశుల వారు ఇస్మార్ట్ గా వ్యవహరించండి.. లేదంటే విమర్శలు తప్పవు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో తొందరపాటు వల్ల విమర్శల పాలవుతారు. సమయం వృధా చేయవద్దు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత టెన్షన్ ఉండొచ్చు.
వృషభం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలను నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సంబంధాల్లో కొంత ఊరట కలగుతుంది. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అనవసర విషయాలపై టెన్షన్ పడొద్దు.
మిథునం
ముఖ్యమైన పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెద్దగా కలసి రావు. ఆదాయం నిలకడగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి.
Also Read: వాలు జడలో వంద కథలు.. ప్రతి జడకి, ముడికి అర్థం ఉంది..
కర్కాటకం
మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. పనుల్ని వాయిదా వేయొద్దు. పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేసేయండి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం
అనవసరమైన పనుల కోసం ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆదాయం తక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడం సరికాదు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్య
కార్యాలయంలోని ప్రతికూల పరిస్థితులను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉద్యోగాల్లో చేరాలి అనుకునే వారికి ఇదే శుభసమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సాంస్కృతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు కొత్త ఆఫర్‌లు పొందవచ్చు. ఖర్చులు తగ్గించండి.
Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
తుల
ఆరోగ్యం మెరుగుపడుతుంది. పని పట్ల నిజాయితీగా ఉండండి. ఎవరి మనోభావాలను అగౌరవపరచవద్దు. ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలను వాయిదా వేయండి.
వృశ్చికం
మీ దినచర్య మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు
మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. కోపం మీ పనిని నాశనం చేస్తుంది. ఆదాయ మార్గాల్లో తగ్గుదల ఉంటుంది. పోటీ పరీక్షలకు యువత చాలా సన్నద్ధం కావాలి. తెలియని వ్యక్తులను నమ్మవద్దు.
Also Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
మకరం
ప్రయాణాలు చేయవచ్చు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. మంచి బహుమతి పొందుతారు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. అనవసర పనులపై సమయాన్ని వృథా చేయకండి. పూర్వీకుల నుంచి వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి.
కుంభం
అతి కష్టమైన పరిస్థితుల మధ్య మీ విలువ నిరూపించుకుంటారు. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజు ఒంటరిగా ఉంటారు. గతంలో చేసిన పనులు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు.
మీనం
చేపట్టిన పని పూర్తి చేయడంలో అజాగ్రత్తగా ఉండకండి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. భార్యాభర్త మధ్య అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వ్యాపారులు లాభపడతారు, ఉద్యోగులకు శుభసమయం.
Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి